Mynampalli Warning: బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ని హైదరాబాద్‌లో తిరగనివ్వం.. ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్

Mynampalli Warning: బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ని హైదరాబాద్‌లో తిరగనివ్వం.. ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్
Mynampalli Hanumantharao

టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య నిప్పు రాజేసింది. అది కాస్త, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య వ్యక్తిగత దూషణలకు దారి తీసింది.

Balaraju Goud

|

Aug 16, 2021 | 12:34 PM


Malkajgiri MLA Mynampalli Hanumantrao: సంతోషంతో జరుపుకునే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఓ చిన్న ఫొటో.. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య నిప్పు రాజేసింది. అది కాస్త, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య వ్యక్తిగత దూషణలకు దారి తీసింది. బండి సంజయ్, మైనంపల్లి… ఇద్దరూ తీవ్ర స్థాయిలో చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు మైనంపల్లి ఇంటిపై కోడిగుడ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనపై తాజాగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీవీ9 తో మాట్లాడుతూ.. సంచలన ఆరోపణలు చేశారు. ఓ రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి, హుందగా వ్యవహరించడంలేదని మండిపడ్డారు. నిన్న జరిగిన ఘటనకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మైనంపల్లి డిమాండ్ చేశారు. లేదంటే బండి సంజయ్‌ను హైదరాబాద్ నగరంలో తిరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ.. హాఫీజ్‌పేట్‌లో ల్యాండ్ సెటిల్‌మెంట్ చేస్తున్నాడని మైనంపల్లి ఆరోపించారు. త్వరలో ఆధారాలతో సంజయ్ బండారం బయట పెడతానన్నారు. మల్కాజ్‌గిరిలో బంద్ ప్రజలు చేయాలి గానీ, నాయకులు కాదన్నారు.

మతాలను రెచ్చెగొట్టే సంజయ్‌తో మాత్రమే విభేదాలు తప్ప.. బీజేపీతో కాదన్నారు మైనంపల్లి. రెండు పార్టీ మధ్య గొడవ చేయాలని రెచ్చగొడుతున్నారని, నియోజకవర్గంలో దాడికి పాల్పడాలంటూ బీజేపీ కార్యకర్తల మీద ఒత్తిడి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇన్ని రోజులు ఓపిక పట్టం కానీ ఇప్పుడు ధీటుగా సమాధానం చెప్తామన్నారు..స్వామిజీలను తీసుకువస్తానని, గుడుల దగ్గర సంజయ్ డబ్బులు వసూల్ చేస్తున్నారని ఆరోపించిన మైనంపల్లి.. స్టేట్ ప్రెసిడెంట్ అని విర్రవీగితే బుద్ది చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. సంజయ్ చిల్లర రాజకీయాలు మల్కాజిగిరిలో పని చేయవన్నారు.

ఇదిలావుంటే, బీజేపీ రాష్ట్ర పార్టీ​అధ్యక్షులు బండి సంజయ్​కుమార్‌పై మల్కాజ్‌గిరి టీఆర్ఎస్​ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారమే రేపుతోంది. నేతల మధ్య బూతులపురాణం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారాయి. రా చూసుకుందాం అని హెచ్చరించారు. రాయడానికి కూడా ఉపయోగించని కామెంట్లు చేశారు ఎమ్మెల్యే మైనంపల్లి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అయితే, బండి సంజయ్ మధ్య మైనంపల్లి మధ్య రాజుకున్న రచ్చ.. ఇప్పుడు కార్యకర్తలు, దాడుల వరకూ వెళ్లింది. అర్థరాత్రి మైనంపల్లి ఇంటి దగ్గర బీజేపీ కార్యకర్తలు పెద్ద హంగామానే సృష్టిచారు. హైదరాబాద్‌ కొంపల్లిలోని ధూలపల్లిలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. బీజేపీ మహిళా కార్యకర్తలు మైనంపల్లి ఇంటివద్ద ఆందోళనకు దిగారు. మైనంపల్లి ఇంటిపై కోడిగుడ్లు విసిరేందుకు యత్నించారు. ఐతే వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

నిన్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చెలరేగిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. కార్పొరేటర్‌ శ్రవణ్‌పై దాడి ఘటనతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడిలో గాయపడిన శ్రవణ్‌ను పరామర్శించిన బండి సంజయ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో బండి సంజయ్‌ను తీవ్ర పదజాలంతో ధూషించారు మైనంపల్లి. దీంతో రగిలిపోయిన బీజేపీ మహిళా కార్యకర్తలు ధూలపల్లిలోని మైనంపల్లి ఇంటివద్ద ఆందోళనకు దిగారు. ఐతే వారిపై మైనంపల్లి పర్సనల్‌ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారని ఆరోపిస్తున్నారు బీజేపీ మహిళా కార్యకర్తలు. దీంతో వారిని పేట్ బషీరాబాద్‌ స్టేషన్‌కు తరలించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu