ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపై బోల్తాపడిన కంకర టిప్పర్.. నలిగిపోయిన డ్రైవర్!

నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ మండలం దర్యాపూర్ తండా సమీపంలో కంకర టిప్పర్, కారు ఢీకొన్న ప్రమాదంలో నవీన్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ కారును బలంగా ఢీకొట్టడంతో అదుపుతప్పి కారుపై బోల్తాపడింది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపై బోల్తాపడిన కంకర టిప్పర్.. నలిగిపోయిన డ్రైవర్!
Tragic Road Accident

Updated on: Oct 31, 2026 | 5:41 PM

నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ మండలం దర్యాపూర్ తండా సమీపంలో కంకర టిప్పర్, కారు ఢీకొన్న ప్రమాదంలో నవీన్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ కారును బలంగా ఢీకొట్టడంతో అదుపుతప్పి కారుపై బోల్తాపడింది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

కారులో చిక్కుకుని మృతి

ప్రమాద సమయంలో నవీన్ రెడ్డి కారులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టిప్పర్ బోల్తాపడటంతో కారు భారీ వాహనం కింద నలిగిపోయింది. దీంతో ఆయన వాహనంలోనే చిక్కుకుపోయారు. తీవ్రంగా దెబ్బతిన్న కారులో చిక్కుకున్న నవీన్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు పూర్తిగా ధ్వంసం కావడంతో మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జేసీబీ పాయంతో కంకరను తొలగించి, కారు నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనతో దర్యాపూర్ తండా సమీపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us