Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎప్పటివరకంటే?

హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు సుమారు 6.2 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం నుంచే ఈ ఆంక్షల్లో అమల్లో ఉంటాయని.. ఈ నేపథ్యంలో వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Hyderabad: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎప్పటివరకంటే?
Uppal Ring Road Traffic Restrictions

Updated on: Apr 27, 2026 | 7:00 AM

ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద విద్యుత్ జంక్షన్ సమీపంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో, ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే ప్రధాన మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే గతంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న బస్టాండ్‌ను తాత్కాలికంగా నల్లచెరువు కట్ట వద్దకు మార్చినట్టు తెలిపారు. ఇకపై వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట మార్గాల్లో వెళ్లే బస్సులు అక్కడికే వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

సికింద్రాబాద్ నుంచి వరంగల్ మధ్య రాకపోకలు సాగించే భారీ వాహనాలు హబ్సిగూడ చౌరస్తా వద్ద మళ్లింపు ఉంటుందని తెలిపారు. ఈ వాహనాలు ఇక్కడి నుంచి నాచారం, మల్లాపూర్, ఐఓసీ మీదుగా చెంగిచర్ల చేరుకుని, అక్కడి నుంచి నేషనల్ హైవేకి వెళ్లాల్సి ఉంటుందన్నారు.అలాగే చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాంధీ పార్కు వద్ద నుంచి లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక వైపు ఉన్న రోడ్డు ద్వారా వరంగల్ రహదారికి చేరుకోవచ్చని సూచించారు.

ఇక బోడుప్పల్ నుంచి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద నుంచి భగాయత్ లేఅవుట్ మీదుగా నాగోల్ వెళ్లాల్సి ఉంటుందని..  బైక్‌లు నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 81, 813ల మీదుగా ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లాలని సూచించారు.అలాగే బోడుప్పల్ నుంచి వచ్చే పెద్ద వాహనాలు నాగోల్ బ్రిడ్జి కింద యూ-టర్న్ తీసుకుని ఉప్పల్ వైపు రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి, పైన పేర్కొన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us