TGSRTC: మీ ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు వెళ్లనక్కర్లేదు.. దసరాకు ఆర్టీసీ సూపర్ ఛాన్స్..

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. దసరాకు సొంతూరుకెళ్తున్నారా..? బస్సులో సీటు దొరకదనే టెన్షన్ ఉందా..? అయితే నో ఫియర్.. దసరాకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఇంటి వద్దకే బస్సు పంపించనున్నట్లు ప్రకటించింది. ఇదెలా అంటే..

TGSRTC: మీ ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు వెళ్లనక్కర్లేదు.. దసరాకు ఆర్టీసీ సూపర్ ఛాన్స్..
Tgsrtc

Updated on: Oct 07, 2026 | 6:58 AM

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దసరాకు సొంతూరు వెళ్లేవారి కోసం ప్రత్యక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తుంది. హైదరాబాద్‌ నుంచి లక్షలాది మంది దసరా, బతుకమ్మ పండక్కి తమ సొంత ఊర్లకు పయనమవుతారు. విద్యాసంస్థలు, ఆఫీసులకు పండుగ సెలవులు కావడంతో నగరం విడిచి తమ స్వస్థలాలకు వెళతారు. దీంతో బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసి కనిపించనుండగా.. రద్దీ కారణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తిప్పనుంది. ఈ క్రమంలో పండుగ స్పెషల్ బస్సులపై టీజీఎస్‌ఆర్టీసీ కీలక ప్రకటన చేయనుంది. ఎక్కువమంది ప్రయాణికులుంటే ఇంటి వద్దకే బస్సులు పంపిస్తామని ప్రకటించింది. దీని వల్ల బస్టాండ్ వరకు వచ్చి బస్సుల కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

ఇంటి వద్దకే బస్సు రావాలంటే ఏం చేయాలి..?

30 మంది గ్రూపుగా ఉంటే ప్రత్యేక బస్సు కోసం బుకింగ్ చేసుకోవాలి. దీంతో ఆర్టీసీ అధికారులు మీ ఇంటి వద్దకే బస్సు పంపిస్తారు. దీని వల్ల బస్టాండ్‌ వరకు వెళ్లాల్సిన పని ఉండదు. గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్ షిప్‌లు, కాలనీల్లో ఎక్కువమంది నివసిస్తూ ఉంటారు. ఒకే ప్రాంతానికి వెళ్లావారు 30 మంది ఉండి, ముందే కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే బస్సు పంపిస్తామని ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణ సౌకర్యం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకన్నట్లు స్పష్టం చేసింది. దీని వల్ల ప్రయాణికులకు సమయం, డబ్బులు ఆదా కానున్నాయి. సాధరణంగా బస్సు ఎక్కేందుకు బస్టాండ్ వరకు రావాల్సి ఉంటుంది. బస్సు బయల్దేరడానికి కొద్ది నిమిషాల ముందే బస్టాండ్‌కు చేరుకోవాలి. ఇక ముందే చేరుకున్నవారు బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉండాలి.

ప్రత్యేక బస్సులు ఎలా బుక్ చేసుకోవాలి..?

మీ ఇంటి వద్దకే బస్సు రావడం వల్ల బస్సు మిస్ అవుతుందనే టెన్షన్ ఉండదు. ఈ బస్సులు బుక్ చేసుకునేందుకు ప్రత్యేక నెంబర్లను ఏరియాల వారీగా ఆర్టీసీ విడుదల చేసింది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఏఎస్‌రావు నగర్, తార్నాక, ఉప్పల్‌, రేతిఫైల్ ప్రాంతాల్లో ఉండేవారు సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం నంబరు 99592 26142ను సంప్రదించాలి. కూకట్‌పల్లి, మియాపూర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, బాలానగర్‌, పటాన్‌చెరు, బీరంగూడ, దుండిగల్, ప్రాంతాల్లో నివసించేవారు 99562 26148ను సంప్రదించాల్సి ఉంటుంది. దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, ఎల్బీనగర్, బడంగ్‌పేట్, ఆదిభట్ల, మిధాని, సరూర్‌నగర్‌ ప్రాంతాలవారు 99892 26136 నెంబర్‌కు కాల్ చేసి బుక్ చేసుకోవాలి. అలాగే విద్యార్థుల కోసం కాలేజీలు, హాస్టళ్ల వద్ద నుంచే ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దీని వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. విద్యార్థులు వేలమంది ఉంటారు గనుక వారి కాలేజీల వద్ద నుంచే బస్సులు నడపనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us