Telangana: కులూలో పారాగ్లైడింగ్‌ చేస్తూ.. తెలంగాణ యువతి మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన నవ్య(26)..మనాలి సమీపంలోని దోభీ గ్రామంలో పారాగ్లైడింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. టెన్డం ఫ్లైట్‌లో టేకాఫ్‌ అయిన నిమిషాలకే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. . పర్యాటకురాలి సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకుండానే అనుమంతించడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Telangana: కులూలో పారాగ్లైడింగ్‌ చేస్తూ.. తెలంగాణ యువతి మృతి
Paragliding
Follow us

|

Updated on: Feb 12, 2024 | 10:03 AM

హిమాచల్‌ప్రదేశ్‌లో విషాద ఘటన వెలుగుచూసింది. అక్కడి కులూలో పారాగ్లైడింగ్‌ తెలంగాణకు చెందిన ఓ టూరిస్టు దుర్మరణం చెందాడు. దీంతో  నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్‌ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రక్షణ బెల్ట్‌ నాణ్యతను పూర్తిగా చెక్ చేయకుండానే అనుమతించడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైన శర్మ ఈ ఘటనపై రెస్పాండ్ అయ్యారు. మానవ తప్పిదం కారణంగానే ఈ విషాద ఘటన జరిగి ఉండొచ్చని చెప్పారు. పారాగ్లైడింగ్‌ చేసిన ఏరియా, ఎక్విప్‌మెంట్‌కు పర్మిషన్ ఉందని, పైలట్‌కు రిజిస్ట్రేషన్‌ ఉందన్నారు. వెదర్ ప్రాబ్లమ్స్ సైతం లేవన్నారు. ఈ ప్రమాదంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో పారాగ్లైడింగ్‌ను సస్పెండ్‌ చేసినట్లు వివరించారు. ఘటనకు కారణమైన పారాగ్లైడింగ్‌ పైలట్‌‌పై ఐపీసీ సెక్షన్‌ 336, 334 కింద పైలట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారిణి వివరించారు. మృతిచెందిన టూరిస్టు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన నవ్య(26)గా తెలిసింది. మనాలి సమీపంలోని దోభీ గ్రామంలో పారాగ్లైడింగ్‌  చేస్తూ ఆమె ప్రమాదవశాత్తు మృతిచెందారు.

కులు జిల్లాలోని ప్రముఖ పారాగ్లైడింగ్ స్పాట్‌లలో దోభి కూడా ఒకటి. ఈ ఏరియాలు గతంలో కూడా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. డిసెంబర్ 24, 2022న, మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల టూరిస్ట్ సూరజ్ షా చనిపోయాడు. జూన్ 15, 2022 న, అంబాలా నివాసి ఆదిత్య శర్మ, అతని పైలట్ క్రిషన్ గోపాల్ కూడా పారాగ్లైడింగ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…   

రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..