Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ భారీ గుడ్ న్యూస్.. త్వరలో భారీ నోటిఫికేషన్.. రెడీగా ఉండండి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలపై స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పటినుంచో ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణ ఫలించినట్లయింది. ఇతర వివరాలు చూస్తే..

Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ భారీ గుడ్ న్యూస్.. త్వరలో భారీ నోటిఫికేషన్.. రెడీగా ఉండండి..
Job

Updated on: Jun 06, 2026 | 9:09 PM

తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 5 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించారచు. అతి త్వరలోనే 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 67760 ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. దేశంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలను తమ ప్రభుత్వమే భర్తీ చేసిందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాము గర్వంగా చెప్పుకుంటామన్నారు.

రేవంత్ గుడ్ న్యూస్

ప్రస్తుతం రాష్ట్రంలోని యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దం అవుతుందన్నారు. అయితే ఇటీవల జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీజీపీఎస్సీ ఏకంగా 3 జాబ్ నోటిఫికేషన్లను ప్రకటించి నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. రోడ్లు, భవనాలు, కాలుష్య నియంత్రణ మండలి శాఖలో ఖాళీగా ఉన్న 290 అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే ఆర్‌అండ్‌బీ శాఖలో 222 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (సివిల్) పోస్టులతో పాటు 49 ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా నిరుద్యోగులకు తీపికబురు అందించింది.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు 44 ఏళ్ల గరిష్ట వయో పరిమితి విధించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ శనివారం మరో ప్రకటన చేశారు. 5 వేల పోలీస్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పోలీస్ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఇప్పుడు ఆ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే నోటిఫికేషన్

ఎప్పుడెప్పుడు పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందా అని నిరుద్యోగులు ఎరుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు సీఎం రేవంత్  నుంచి నోటిఫికేషన్ రావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నెలలో లేదా వచ్చే నెలలో పోలీస్ శాఖలోని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. దీంతో నిరుద్యోగులు ఇప్పటినుంచే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు.

Follow Us