జూన్‌ 1 నుంచి మొదలు కానున్న పట్టణ ప్రగతి

రాష్ట్రంలో పచ్చదనానికి పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందు కోసం ప్రజా ప్రతినిధులను, అధికారులతో పాటు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తోంది. ఇందుకోసం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం అమలు చేస్తోంది. దీనికి తోడు మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలపాటు పరిశుభ్రత కార్యక్రమానికి సైతం విశేష స్పందన లభిస్తోంది. దీంతో మరోసారి పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలోని […]

జూన్‌ 1 నుంచి మొదలు కానున్న పట్టణ ప్రగతి
Follow us

|

Updated on: May 28, 2020 | 7:38 PM

రాష్ట్రంలో పచ్చదనానికి పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందు కోసం ప్రజా ప్రతినిధులను, అధికారులతో పాటు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తోంది. ఇందుకోసం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం అమలు చేస్తోంది. దీనికి తోడు మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలపాటు పరిశుభ్రత కార్యక్రమానికి సైతం విశేష స్పందన లభిస్తోంది. దీంతో మరోసారి పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహించాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. పట్టణప్రగతి కార్యక్రమంపై అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, పట్టణప్రణాళిక, మెప్మా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలోపెట్టుకుని పట్టణాల్లో పనులు చేపట్టాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు, దోమల వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కోవాలని ఆదేశించారు. హరితహారం కార్యక్రమాన్నికూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీలకు కావల్సినన్ని మొక్కలు అందించాలని చెప్పారు. మున్సిపాలిటిలో నూటికి నూరుశాతం పన్నులు వసూలు చేయాలన్నారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..