KTR: ఢిల్లీలో బిజీబిజీగా కేటీఆర్‌.. కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌తో భేటీ.. కీలక ప్రాజెక్టులకు సాయం చేయాలని వినతి..

KTR Delhi Tour: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (KTR) దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కీలక ప్రాజెక్ట్‌లపై కేంద్ర సాయం కోరడమే లక్ష్యంగా వరుసగా కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు..

KTR: ఢిల్లీలో బిజీబిజీగా కేటీఆర్‌.. కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌తో భేటీ.. కీలక ప్రాజెక్టులకు సాయం చేయాలని వినతి..
Ktr
Follow us

|

Updated on: Jun 24, 2022 | 7:06 AM

KTR Delhi Tour: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (KTR) దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కీలక ప్రాజెక్ట్‌లపై కేంద్ర సాయం కోరడమే లక్ష్యంగా వరుసగా కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్  పురీ (Hardeep Singh Puri)తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హైద‌రాబాద్ మురుగునీటి పారుద‌ల ప్లాన్‌కు ఆర్థిక సాయం చేయాల‌ని కేంద్రమంత్రిని కోరారు. ఎస్‌టీపీల నిర్మాణాల‌కు 8,654 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌న్నారు. ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతు ఖర్చును.. అమృత్-2 కింద ఇవ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం ప్రాజెక్టు విషయంలో సాయం అందించాలని కోరారు మంత్రి. హైదరాబాద్‌లో 10 కిలోమీటర్ల మేర పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ నుంచి ప్యారడైజ్‌ మెట్రో స్టేషన్‌ వరకు.. పీఆర్‌టీ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం 2,850 కోట్ల రూపాయల కేంద్ర సాయం కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు పూర్తయితే మురుగునీటిని శుద్ధి చేయడమే కాకుండా మూసీ నదితో పాటు, ఇతర నీటి వనరులకు మురుగు కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉందనేది ప్రభుత్వ అభిప్రాయం.

కాగా పెరుగుతున్న జనాభా, ఉపాధి అవకాశాలతో హైదరాబాద్ మహానగరంగా మారుతుందన్న కేటీఆర్‌.. ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చడానికి.. 69కిమీ మెట్రో రైలు నెట్‌వర్క్, 46 కిమీ సబ్-అర్బన్ సేవలు / మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) హైదరాబాద్‌లో ఉందని కేంద్రమంత్రికి తెలిపారు.. మెట్రో రైల్, ఎంఎంటీఎస్‌లకు ఫీడర్ సేవలుగా పని చేసేందుకు వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్( PRTS ) , రోప్‌వే సిస్టమ్స్ వంటి స్మార్ట్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ కోసం తెలంగాణ అన్వేషిస్తోందని కేటీఆర్‌ కేంద్రమంత్రికి తెలిపారు. మరోవైపు ఫాక్స్ కాన్‌ సంస్థ చైర్మన్‌తో మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అవకాశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో ఫాక్స్ కాన్‌ సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఆ సంస్థ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు