Harish Rao: ధరణి పోర్టల్‌పై మంత్రి సమీక్ష.. ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సుదీర్ఘ సమాలోచనలు..

|

Jun 14, 2022 | 2:06 PM

Telangana: ధరణి పోర్టల్​పై సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao), చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ సమస్యలు, అధ్యయనం..

Harish Rao: ధరణి పోర్టల్‌పై మంత్రి సమీక్ష.. ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సుదీర్ఘ సమాలోచనలు..
Minister Harish Rao
Follow us on

Telangana: ధరణి పోర్టల్​పై సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao), చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారం, వచ్చిన ఫిర్యాదులను ఏలా పరిష్కారం చేయాలనే అంశాలపై సమాలోచనలతో చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సిద్ధిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కళాశాలలో ధరణి పోర్టల్​పై సంబంధిత అధికారులతో మంత్రి, సీఎస్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే పరిస్థితిని సమీక్షించాలన్నారు. ధరణి సమస్యల అధ్యయనానికి సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఒక్కొక్కటిగా చర్చించి, వాటిలో టెక్నీకల్ గా ఎదుర్కొంటున్న అంశాలపై కూలంకషంగా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి డివిజన్ పరిధిలో ఇప్పటివరకు వివిధ రూపాల్లో 186, అలాగే ములుగు మండలంలో 46 ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు.

కాగా ధరణి పోర్టల్ రోజువారీ కార్యకలపాల్లో తలెత్తుతున్న ఇబ్బందులైన పేర్లలో తప్పులు దొర్లడం, విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు నమోదు కావడం, సర్వే నంబర్లలో పార్టుల సంబంధిత వివరాల్లో తేడాలు ప్రధాన సమస్యలు, పరిష్కారం పై మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ధరణి పోర్టల్లో ఉన్న లోపాలపై అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి పరిష్కారాలపై కసరత్తు చేసి పోర్టల్లో కొత్త మాడ్యూల్స్ ప్రవేశ పెట్టాలనే యోచనపై సమీక్షలో సమాలోచనలతో.. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే అంశాలపై చర్చించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఉన్నతాధికారులు సీఎంఓ కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జా, టీఎస్ టీఎస్ టెక్నీకల్ సర్వీసెస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు ముజమ్మీల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

అమ్మతో మాట్లాడాలి సార్.. ప్లీజ్‌ ఫోనివ్వరా? ఆ విద్యార్థి చివరి మాటలివే..

ఆప్రికాట్ తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ సమస్యలున్న వారు డైట్ లో చేర్చుకోవాల్సిందే..

World Blood Donor Day 2022: రక్తదానం మహాదానమైనా.. వీరు అసలు బ్లడ్‌ డొనేట్‌ చేయకూడదు తెలుసా?