కరీంనగర్, సెప్టెంబర్ 19: ఇది అత్యంత పురాతన బావి. దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి పురాతన బావిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఇలాంటి బావులు చూడటం అరుదు. అయితే.. ఈ బావి లో భారీగా బంగారు సంపద ఉందని చరిత్ర ఆనవాళ్లు ద్వారా తెలుస్తుంది. దీంతో అక్కడ నిరంతరం తవ్వకాలు చేస్తున్నారు. ఈ బావిలో ఎటు చూసిన తవ్వకాలనే కనబడుతున్నాయి.
కరీంనగర్ సమీపంలో ఎలగందుల అనే పురాతన గ్రామం ఉంది. ఈ ఖిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఖిల్లా నుంచీ 500 మీటర్ల దూరంలో నాగయ్య బావి ఉంది. ఈ బావి కి సమిపంలో నాగాదేవాలయం ఉంటుంది. అందుకే నాగయ్య బావిగా పిలుస్తున్నారు స్థానికులు. ఈ బావిని కాకతీయులు కాలంలో నిర్మించారు. పూర్తిగా రాయితో నిర్మించిన కట్టడం ఇది. ఇప్పటికీ ఈ కట్టడాలు చెక్కు చెదురులేదు. ఈ బావి లో రాజులు రాణులు స్నానం ఆచరించేవారు. ఈ బావి పక్కన రెండు పురాతన గదులు ఉన్నాయి. కాకతీయులు సంపదన కూడా ఈ బావి పక్కనే దాచి పెట్టారనే చరిత్ర ద్వారా తెలుస్తుంది. దీనిని బంగారు బావి కూడా పిలుస్తారు. కింది వరకు కూడా రాళ్లతో నిర్మాణం చేపట్టారు. దేవాలయ నిర్మాణం లాగానే ఈ బావిని నిర్మించారు. ఈ బావి లో ఎప్పటికీ నీరు ఉంటుంది. వేసవి కాలంలో తక్కువ నీరు ఉన్న సమయంలో తవ్వకాలు చేస్తున్నారు.
పక్కన ఉన్న గదుల్లో తవ్వకాలు చేపట్టారు. బంగారం కూడా దొరికిందనే ప్రచారం సాగింది. ఈ ప్రాంతంలో గుప్త నిధుల ముఠా సంచరిస్తుంది. గతంలో మేకతో పాటు, ఇతర జంతువులను కూడా ఈ బావి సమీపంలో బలి ఇచ్చారు. పసుపు, కుంకుమతో పాటు పూజ సామాగ్రీ పెట్టారు. ఇది చూసి స్థానికులు భయపడుతున్నారు. ఈ నీరు పూర్తిగా స్వచ్చంగా ఉంటుంది. పురాతన బావులు ఉన్నప్పటికీ. ఇలాంటి బావులు కనబడటం అరుదు. పూర్తిగా.. రాతి కట్టడాలతో నిర్మించారు. దాదాపునా 60 ఫీట్ల వరకు లోతు ఉంటుంది. బావి పక్కన బట్టలు మార్చుకునే గదులు ఉన్నాయి. ఈ గదుల్లోనే బంగారం ఉందని ప్రచారం ఉంది. దీంతో, బావి పక్కన ఉన్న గదుల సమీపం లో తవ్వకాలు చేపట్టారు.
అంతేకాదు భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు బయటకు వస్తుంది. ఆ సమయంలో బంగారు నాణేలు కొట్టుకు వస్తాయి. దీంతో ఈ బావి సమీపంలో తవ్వకాలు చేస్తున్నారు గుప్త నిధుల ముఠా. గతంలో భారీ బంగారం అమావాస్య రోజున లభించిందని ప్రచారం కూడా జరిగింది. దీంతో ఈ బంగారు బావిపై అందరి దృష్టి ఉంది. సహజంగానే -కాకతీయులు ఎక్కడ పాలన చేసినా అక్కడ నిధులు ఉంటాయి. భారీ సంపద దాచి పెడుతుంటారు. కట్టడాల సమాయంలో బంగారం దాచి పెట్టేవారు. ఈ బావి సమీపంలో కూడా బంగారం ఉందనే ప్రచారం ఉంది. అందుకోసం నిరంతరం తవ్వకాలు చేస్తున్నారు. ఈ బావిని చూటడానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో తగు చర్యలు తీసుకోవాలని, ఈ బావిని పర్యాటక ప్రాంతంగా మార్చాలని కోరుతున్నారు స్థానికులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.