Telangana: తెలంగాణలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూపై క్లారిటీ ఇచ్చిన డీహెచ్ శ్రీనివాసరావు..

కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు ఇటీవల స్పష్టం చేశారు.

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూపై క్లారిటీ ఇచ్చిన డీహెచ్ శ్రీనివాసరావు..
Dh Srinivasarao
Follow us

|

Updated on: Jan 03, 2022 | 9:51 PM

కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు ఇటీవల స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ప్రస్తుతం కేసుల పెరుగుదల థర్డ్‌వేవ్‌కు సంకేతమన్నారు. డెల్టా వేరియంట్‌ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉందని వెల్లడించారు. అయితే కేసుల సంఖ్య పెరుగుదలపై భయాందోళనలు అవసరం లేదన్నారు. గత రెండు వేవ్‌ల్లో నేర్చుకున్న పాఠాలతో సర్కార్, వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని.. ప్రజలెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్‌ నుంచి రక్షించుకోవచ్చాన్నారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి సింటమ్స్ కనిపించడం లేదని డీహెచ్‌ అన్నారు. లక్షణాలు కనిపించినవారు అలెర్ట్‌గా ఉండాలని ఆయన సూచించారు. సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశముందని డీహెచ్‌ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉంటుందని కొందరు ఆకతాయిలు ప్రచారం చేశారు. ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుందని  కొందరు వదంతులు సృష్టించారు. 

ఈ వార్తలపై డీహెచ్‌ శ్రీనివాసరావు తాజాగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉండదన్నారు. జనవరి చివరలో లాక్‌డౌన్‌ ఉండొచ్చని ప్రచారం అవుతున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

Also Read: “బానే ఉంది సంబడం”.. 10 రూపాయలు పెట్టి కొన్న కోడిపిల్లకు 50 రూపాయల బస్‌ టికెట్‌

 ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టగానే బయటకు వచ్చిన అతిథి.. అందరూ షాక్