Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ దసరా గిఫ్ట్.. కీలక ప్రకటన వచ్చేసింది..

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డీఏలు చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ భేటీలో దీనికి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో డీఏల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.

Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ దసరా గిఫ్ట్.. కీలక ప్రకటన వచ్చేసింది..
Cm Revanth Reddy

Updated on: Oct 01, 2026 | 8:51 PM

రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. రెండు డీఏలు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో చర్చ జరిగింది. 235మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని అధికారులు కేబినెట్‌కు వివరించారు. ఈ అంశంపై కేబినెట్‌ సబ్‌కమిటీలో చర్చించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే కరువు పరిస్థితులపై త్వరలోనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితులు, ఉపశమన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించాలని కేబినెట్‌ నిర్ణయించింది. తెలంగాణలో కరువు మండలాల ప్రకటనతో పాటు, సాయం అందించాలంటూ కేంద్రాన్ని కోరాలని కూడా కేబినెట్‌ నిర్ణయానికి వచ్చింది. కేంద్రమంత్రులను కలిసి తెలంగాణలోని కరువు పరిస్థితిని వివరించాలని మంత్రులకు సీఎం రేవంత్‌ సూచించారు.

అటు హైదరాబాద్‌ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ జరిగింది. జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి పోలీస్‌ పరిధులను పునర్విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని పోలీస్‌స్టేషన్ల పరిధులను ఇతర జోన్లు, డివిజన్లకు బదిలీ చేశారు. మార్కెట్‌ పీఎస్‌ పరిధిలోని పలు ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోకి మార్చారు. మహేశ్వరం, శంషాబాద్‌, సైబరాబాద్‌ పరిధుల్లోనూ పోలీస్‌స్టేషన్ల పరిధులను పునర్విభజించారు. శంషాబాద్‌ డివిజన్‌లోనూ కీలక మార్పులు చేశారు. ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పేరును శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌గా మార్చారు. ఆర్‌జీఐఏ, శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్ల పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించారు. రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌, మీర్‌పేట్‌ ప్రాంతాల్లో పోలీస్‌ పరిధులను మార్చారు.

మరోవైపు.. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సనత్‌నగర్‌ ప్రాంతాల్లోనూ పరిధుల పునర్విభజన జరిగింది. ప్రాంతాల వారీగా పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ మార్పులు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కేవలం లా అండ్‌ ఆర్డర్‌ పరిధులకే పరిమితం కాకుండా.. ట్రాఫిక్‌ పోలీస్‌ పరిధిలోనూ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. జోన్లు, డివిజన్లలో మార్పులు చేశారు. వుమెన్‌ సేఫ్టీ వింగ్‌కు కొత్తగా జోన్లను కేటాయించారు. జోనల్‌ సైబర్‌ సెల్‌ పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించారు. మొత్తంగా.. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో 76 ప్రాంతాలకు సంబంధించి మార్పులు జరిగాయి. వివిధ పోలీస్‌స్టేషన్లు, జోన్లు, డివిజన్ల పరిధులను పునర్విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us