CM KCR: పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలి.. అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం..

|

Jun 26, 2021 | 7:15 PM

Pattana Pragathi: పట్టణాల వారీగా అధికారులు క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని.. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దీంతోపాటు క‌లెక్ట‌ర్ల అనుమ‌తి లేకుండా

CM KCR: పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలి.. అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం..
KCR -
Follow us on

CM KCR on Pattana Pragathi: పట్టణాల వారీగా అధికారులు క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని.. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దీంతోపాటు క‌లెక్ట‌ర్ల అనుమ‌తి లేకుండా కొత్త లేఅవుట్‌లను అనుమ‌తించొద్దంటూ సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూత‌న చ‌ట్టాల్లోని నిబంధ‌న‌ల‌ను విధిగా అమ‌లు ప‌ర‌చాల‌ని సూచించారు. వ‌ల‌స కార్మికుల పాల‌సీని రూపొందించాల‌ని కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై అధికారుల‌తో సమీక్ష సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ సలహాలు, సూచనలు చేశారు.

గ్రామాలు, పట్టణాల్లో అన్నిశాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేసుకొవాలి.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. జులై చివరికల్లా ప్రభుత్వ శాఖల మధ్య పేరుకుపోయిన బకాయిలను ‘బుక్ అడ్జస్ట్ మెంట్’ ద్వారా పరిష్కరించాలన్నారు. ఇకనుంచి అన్నిశాఖల నడుమ విధిగా చెల్లించాల్సిన బిల్లులను పరస్పరం వెంట వెంటనే చెల్లించాలన్నారు.

భవిష్యత్ తరాలను, తెలంగాణ పట్టణాల అభివృద్ధి ని దృష్టిలో ఉంచుకొని, ప్రతి పట్టణంలో కనీసం నాలుగు, ఐదు డంపు యార్డుల కోసం, టౌన్లకు దగ్గరలో స్థలాలను సేకరించి ఉంచాలని సూచించారు. హైదరాబాద్, కాస్మోపాలిటన్ నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో… అందుకు అనుగుణంగా, హెచ్ఎండీఏ పరిధిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలన్నారు. దీంతోపాటు వలస కార్మికుల పాలసీని రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Also Read:

దారుణం..మూడుముళ్ళు పడ్డ మూడు రోజులకే..నవ వధువుపై భర్త.. మరుదుల సామూహిక అత్యాచారం!

Delta Plus variant: వణికిస్తున్న డెల్టా వేరియంట్.. తమిళనాడులో తొలి మరణం నమోదు..