హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు.. కొత్త స్టేషన్‌లు వచ్చేది ఈ ప్రాంతాల్లోనే!

Telangana Bullet Train Project: రాష్ట్రంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రతిపాధించిన స్టేషన్‌ల ఏర్పాటులో కీలక మార్పులు చేయనున్నట్టు తెలిపింది. తాజాగా బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై జరిగిన సమావేశంలో స్టేషన్‌ల మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు.. కొత్త స్టేషన్‌లు వచ్చేది ఈ ప్రాంతాల్లోనే!
Telangana Bullet Train Project

Updated on: Jun 19, 2026 | 10:00 AM

తెలంగాణలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు విషంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. హైదరాబాద్-పూణె మీదుగా ముంబై వరకు బుల్లెట్‌ రైలును తీసుకురావాలని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రతిపాదనలు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత స్టేషన్‌ల ఏర్పాటులో మార్పులు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌-పుణె-ముంబయి బుల్లెట్‌ రైలు కారిడార్‌లో భాగంగా వికారాబాద్‌ కాకుండా అనంతగిరిలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే కోకాపేట స్టేషన్‌ విషయంలో భారీగా వ్యయప్రయాసలు ఉన్నాయని.. ఇదే విషయాన్ని NHRCL దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

దీనిలో పాటు హైదరాబాద్-టూ- బెంగళూరు రైల్వే ప్రాజెక్టుఉలో భాగంగా సోమశీలలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సోమశిల, అనంతగిరిలలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసమే ఈ ప్రాంతాల్లో బుల్లెట్‌ రైలు స్టేషన్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇదే అంశంపై ఇవాళ ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ అధికారులతో ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు.

అయితే NHRCL ప్రతిపాదన ప్రకారం.. కోకాపేటలోని నియోపోలీస్ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం NHRCL 247 ఎకరాల భూమిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఆ ప్రాంతంలో ఎకరం భూమి ధర రూజ.150 కోట్లకు పైగా పలుకుతుండడంతో ప్రాజెక్టు మొత్తం ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. అంటే స్టేషన్ మొత్తం పూర్తి అవడానికి రూ.1.90లక్షల అవ్వొచ్చని ప్రభుత్వం అంచనా వేయగా.. కేవలం ఈ భూమిని సేకరించేందుకే రూ.37 వేల కోట్ల ఖర్చు పెట్టాల్సి వస్తోందని అంచనా వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us