
తెలంగాణలోని నిర్మాణ రంగంలో పారదర్శకత, క్రమబద్ధీకరణనే లక్ష్యంగా భవన నిర్మాణ నిబంధనల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్TDR వినియోగంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై రాష్ట్రంలో 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హై రైజ్‌గా పరిగణించనున్నట్టు పేర్కొంది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. 2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణ కలిగిన ప్లాట్లలో అదనపు అంతస్తు నిర్మాణానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
అలాగే 40 ఫీట్ రోడ్ దగ్గర 3 అదనపు అంతస్తుల భవన నిర్మాణానికి, 60 ఫీట్ రోడ్ దగ్గర 4 అదనపు అంతస్తులకు, 80 ఫీట్ రోడ్ దగ్గర 5 అదనపు అంతస్తులకు ప్రభుత్వం అనుమతి ఇంచ్చింది. ఇక 10 అంతస్తులపైగా భవనాల నిర్మాణానికి మాత్రం TDR వినియోగం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అలాగే 20 అంతస్తులపైగా భవనాలకు 5 శాతం TDR లోడింగ్ కల్పించారు.
ఇక 750-2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీరణం ఉన్న ప్లాట్లలో 18-21 మీటర్ల భవనాలకు TDR తప్పనిసరి చేసింది. అలాగే నాన్ హై రైజ్ బిల్డింగ్స్‌కు సెట్‌బ్యాక్ సడలింపు ఇవ్వగా హై రైజ్ భవనాల్లో 10 శాతం వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు అనుమతించనున్నారు. అలాగే బిల్డింగ్ అనుమతి సమయంలో 50 శాతం TDR సమర్పించాలని, మిగతా 50శాతం టీడీఆర్‌ను ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు ముందు సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.