నేను లైంగికంగా వేధించబడ్డా.. సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఏం చేశాడంటే..?

|

Feb 20, 2022 | 8:59 AM

లైంగిక వేధింపులు(Sexual Harassment) తాళలేక ఆత్మహత్య(Suicide) చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో అందరూ..

నేను లైంగికంగా వేధించబడ్డా.. సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఏం చేశాడంటే..?
Suicide
Follow us on

లైంగిక వేధింపులు(Sexual Harassment) తాళలేక ఆత్మహత్య(Suicide) చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో అందరూ నిద్రపోయిన తరువాత ఫ్యాన్ కు ఉరివేసుకుని తనువు చాలించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్(Hyderabad) గౌలిదొడ్డిలో ఈ విషాద ఘటన జరిగింది. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా చారగొండ గ్రామానికి చెందిన లింగారం లక్ష్మయ్య-సువర్ణ దంపతుల రెండో కుమారుడు వంశీకృష్ణ. అతను హైదరాబాద్ గౌలిదొడ్డి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి వసతిగృహంలోని తోటి విద్యార్థులతో కలిసి చదువుకున్నాడు. అనంతరం గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉదయం ఎంతకూ తలుపు తీయకపోయేసరికి తోటి విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. ఎలాగోలా తలుపులు తోసుకుని లోపలికెళ్లి చూడగా వంశీకృష్ణ ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వంశీకృష్ణ బ్యాగులో రెండు ఆత్మహత్య లేఖలు లభించాయి. తాను లైంగికంగా వేధించబడ్డానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో పేర్కొన్నాడు.

Also Read

CM KCR: మోడీ సర్కార్‌పై సమరానికి సై.. మరికాసేపట్లో ముంబైకి సీఎం కేసీఆర్..

News Watch: తగ్గేదేలే – కేసీఆర్… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Team India: ఐపీఎల్ వద్దంది.. టీమిండియా రమ్మంది.. ఆ యంగ్ ప్లేయర్‌కు టెస్ట్ జట్టులో చోటిచ్చిన బీసీసీఐ.. ఎవరంటే?