Telangana: గుడిసెలో చాటు మాటున చాక్లెట్ల బేరాలు.. తీరా చూస్తూ పోలీసులే షాక్..!

గంజాయి అక్రమ రవాణా రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. గంజాయిపై పోలీసులు ఉక్కు పాదం మోపినా, తరచు ఏదో ఒక ప్రదేశంలో మాదకద్రవ్యాలు పట్టుపడుతూనే ఉన్నాయి. పోలీసులు వాటిని ఎంత కట్టడి చేయాలి అనుకున్న హైదరాబాద్ మహానగరంలో ఏదో ఒక మూలన గంజాయి లభ్యమవుతునే ఉంది. పట్టపగలు అర్ధరాత్రిలను తేడా లేకుండా విపరీతంగా గంజాయి విక్రయాలు చేస్తున్నారు గంజా ముఠా సభ్యులు.

Telangana: గుడిసెలో చాటు మాటున చాక్లెట్ల బేరాలు.. తీరా చూస్తూ పోలీసులే షాక్..!
Ganja Chocolate
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 02, 2024 | 11:37 AM

గంజాయి అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతుంది. గంజాయిపై పోలీసులు ఉక్కు పాదం మోపినా, తరచు ఏదో ఒక ప్రదేశంలో మాదకద్రవ్యాలు పట్టుపడుతూనే ఉన్నాయి. పోలీసులు వాటిని ఎంత కట్టడి చేయాలి అనుకున్న హైదరాబాద్ మహానగరంలో ఏదో ఒక మూలన గంజాయి లభ్యమవుతునే ఉంది. పట్టపగలు అర్ధరాత్రిలను తేడా లేకుండా విపరీతంగా గంజాయి విక్రయాలు చేస్తున్నారు గాంజా ముఠా సభ్యులు. స్టూడెంట్ నుంచి మొదలుకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వరకు ఏ ఒక్కరిని వదలకుండా గంజాయికి బానిసలుగా మారుస్తున్నారు. మీ జేబులో డబ్బులు ఉండాలి అంతే నిరంతరం ఏదో ఒక ప్రదేశంలో గంజాయి దొరుకుతుంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్న గంజాయి ముఠాలు.

తాజాగా హైదరాబాద్ మహానగరం శివారు మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్స్‌ను విక్రయిస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు. మొయినాబాద్ పరిధిలోని తోలుకట్ట గ్రామ శివారులో ఒక షెడ్డులో అక్రమంగా దాచిన గంజాయితోపాటు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. బీహార్ కు చెందిన సౌరబ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి యువకుడు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వలస వచ్చి గంజాయి విక్రయాలను మొదలుపెట్టాడు. అతనికి తోడుగా పాత నేరస్తుడైన అలీ ఖాన్ తో తోడయ్యాడు. ఇద్దరు కలిసి గంజాయి అక్రమ దందాకు తెర లేపారు. పక్కా సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు తోలుకట్ట గ్రామ శివారులోని షెడ్‌లో తనిఖీలు చేపట్టారు. దీంతో గంజాయి గుట్టురట్టైంది.

గతంలో ఫోన్ల దొంగతనానికి పాల్పడిన నిందితుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 580 గ్రాముల గంజాయి 92 గంజాయి చాక్లెట్లను రూ. 4,500 నగదును ఐదు మొబైల్ ఫోన్లతో పాటుగా దొంగతనం చేసిన రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు.

ఇలా ఉండగా పాతబస్తీలోని ఉప్పుగుడాలో భారీగా గంజాయి ని పట్టుకున్నారు శంషాబాద్ ఎస్‌వోటి పోలీసులు. ఐదు లక్షల విలువ చేసే 14 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి గంజాయితోపాటు ఒక కారు రెండు మోటార్ సైకిళ్ళు, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. గంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి విద్యార్థులకు విక్రయిస్తున్నారు మహిళలు. ఈ కేసులో శిరీష పద్మతోపాటు శ్రీనివాస్ చారి అనే వ్యక్తిపై ఎన్‌డీపీఎస్ ఆర్‌టీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!