Weather Report: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల్లో వాతావరణ ఎలా ఉంటుదంటే

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. గత మే నెలలో దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడూ దేశంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి కూడా వేగంగా తిరోగమిస్తున్నాయని తెలిపింది. దానికి తోడు బంగాళాఖాతంలోని ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Weather Report: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల్లో వాతావరణ ఎలా ఉంటుదంటే
Imd Weather Update Telugu States

Updated on: Oct 08, 2026 | 6:00 PM

వర్షాకాలం సీజన్ ముగిసింది.. గత మే నెలలో దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టాయి. మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, గోవా, కర్ణాటక, తెలంగాణ, ఒడిశాలలోని కొన్ని ప్రాంతాలు, అలాగే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలోని మరికొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు మరింతగా వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం ఈ తిరోగమణ రేఖ సుపాల్, రాంచీ, సుందర్‌గఢ్, బర్గఢ్, బిజాపూర్, హైదరాబాద్, బెళగావి, పంజిమ్ మీదుగా సాగుతోంది. తెలంగాణలో ఈ రేఖ తాండూర్, వికారాబాద్, హైదరాబాద్, జనగాం, భూపాలపల్లి గుండా వెళుతోంది.

రాబోయే 3 నుంచి 4 రోజుల్లో తూర్పు భారతదేశం, ఉత్తర ద్వీపకల్పంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు మరింతగా తిరోగమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. మరికొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచానా వేసింది.

మరోవైపు తూర్పు ఉత్తర ప్రదేశ్ నుండి రాయలసీమ వరకు, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీనపడిందని.. ఆంధ్రప్రదేశ్, యానాంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ఏపీలో రాగల మూడు రోజుల వాతావరణ హెచ్చరికలు

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో గురు, శుక్రవారాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించవచ్చు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే వీలుంది. శనివారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశముంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.

ఇక రాయలసీమలో గురు, శుక్రవారాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచవచ్చని.. శనివారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశముంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us