AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను చంపద్దురా నాన్న అని వేడుకున్నా చలించని కొడుకు.. తల్లిని నదిలోకి తోసేసి..

చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి కంటికి రెప్పలా కాపాడిన తల్లి అతనికి భారంగా మారింది..జీవిత చమరంకం లో ఆపసోపాలు పడుతున్న ఆ తల్లికి అండగా నిలవాల్సిన కొడుకే కసాయిగా మారాడు..సపర్యాలు చేయాల్సి వస్తుంది అని ,జన్మను ఇచ్చిన తల్లిని కడతేర్చాడు..ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని చెప్పడంతో ఆశతో అతనితో వెళ్లిన అమ్మను మంజీరా నదిలో తోసేసి చేతులు దులుపుకున్నాడు..వద్దురా నాన్న అని ఆ తల్లి ఎంత వేడుకున్నా ఆ కసాయి మనసు కరగలేదు..మంజీర లో శవం అయి తేలడంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

నన్ను చంపద్దురా నాన్న అని వేడుకున్నా చలించని కొడుకు.. తల్లిని నదిలోకి తోసేసి..
Diwakar P
| Edited By: Jyothi Gadda|

Updated on: Sep 15, 2025 | 1:51 PM

Share

కామారెడ్డి జిల్లా లొ దారుణం జరిగింది.ఎర్రోళ బాలయ్య అనే కసాయి కుమారుడు కన్న తల్లిని మంజీర నదిలో తోసేసి హత్య చేశాడు.తల్లినీ బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చూయిస్తానని తీసుకువచ్చి బాన్సువాడ పరిసర ప్రాంతంలో ఉన్న మంజీర నదిలో తోసేసి హైదరాబాద్ ఫరారయ్యాడు. మంజీర నదిలొ గుర్తు తెలియని వృద్ధురాలి శవం దొరికిందని పిట్లం పోలీసులు ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.బాన్సువాడ మండలం బొర్లం గ్రామస్థురాలనీ గుర్తించి బొర్లం గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతురాలు సాయవ్వను కొడుకు అతని తో పాటు మరో బాలుడు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీని ఆధారంగా పోలీసులు విచారించగా మరో బాలుడు సహాయంతో బైక్ పై తీసుకెళ్లి మంజీర లో తల్లిని తోసేసినట్లు పోలీసులు నిర్ధారించి, ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యువకుడు మైనర్ అని డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి తెలిపారు.

తనకు ఏమీ తెలియదని మైనర్ బాలుడు పోలీసులతో చెప్పాడు..ఆసుపత్రికి తీసుకెళ్దాం అనటంతో వృద్ధురాలు ఆశ తన బైక్ పై అతికష్టం మీద కూర్చుందని, నదిలో తోసేపుడు కూడా వేడుకుందని బాలుడు పోలీసులకు వెల్లడించాడు.  తల్లి అనారోగ్యంతో ఉండటంతో పడుకున్న చోటే మల,మూత్ర విసర్జన చేసుకుంటుండటంతో దుర్వాసన వస్తుందని తల్లి నీ చంపినట్లు కొడుకు బాలయ్య అంగీకరించినట్టుగా  పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ ఘటన దురదృష్టమని గ్రామంలో చర్చించుకుంటున్నారు. బాలయ్య భార్య గతంలో ఆత్మహత్య చేసుకుంది..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..