ఎమ్మెల్సీ కొడుకునంటూ పరిచయం.. యువతికి వేధింపులు

| Edited By:

May 24, 2020 | 12:58 PM

నాలుగు నెలల క్రితం ఎమ్మెల్సీ కొడుకు అని చెప్పి యువతికి పరిచయమయ్యాడు.. నోముల భరత్ గౌడ్ అనే వ్యక్తి. ఆ పరిచయం అనంతరం ప్రేమిస్తున్నానంటూ యువతిని వేధింపులకు..

ఎమ్మెల్సీ కొడుకునంటూ పరిచయం.. యువతికి వేధింపులు
Follow us on

ఎమ్మెల్సీ కొడుకునంటూ పరిచయమయ్యాడు. అనంతరం ప్రేమా.. అంటూ యువతిని వేధించసాగాడు. కట్ చేస్తే.. 15 లక్షల రూపాయలు ఇవ్వాలని లేదంటే.. నీ ఫొటోస్ సోషల్ మీడియాలో పెడతానంటూ యువతిని తరుచూ బెదిరిస్తూండేవాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. గత నాలుగు నెలల క్రితం ఎమ్మెల్సీ కొడుకు అని చెప్పి యువతికి పరిచయమయ్యాడు.. నోముల భరత్ గౌడ్ అనే వ్యక్తి. ఆ పరిచయం అనంతరం ప్రేమిస్తున్నానంటూ యువతిని వేధింపులకు గురి చేశాడు. ఆ తర్వాత 15 లక్షల రూపాయలు ఇవ్వాలని లేదంటే.. నీ ఫొటోస్ సోషల్ మీడియాలో పెడతానంటూ యువతికి తరుచూ ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరిస్తూండే వాడు. దీంతో విసుగు చెందిన యువతి.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. పోచంపల్లి గ్రామానికి చెందిన నిందితుడు నోముల భరత్ గౌడ్‌పై ఫోక్సో సెక్షన్‌ల కింద పలు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read More:

బ్రేకింగ్: మరో బాలీవుడ్ నటుడికి కరోనా పాజిటివ్

మా అమ్మాయికి ప్రభాస్ లాంటోడు కావాలి… అనుష్క తల్లి

రైళ్లను ఎలా శానిటైైజ్ చేస్తున్నారో.. స్పెషల్ వీడియో రిలీజ్