Viral: చేతిలో కర్ర.. చింపాంజీ వేషం వేసి పరుగులు పెట్టిన సర్పంచ్.. ఎందుకో తెలుసా..?

అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ సర్పంచ్ ఎన్నికలకు ముందు నేతలు ఎన్నో విషయాలను చెబుతారు.. అయితే.. కొందరు వాటిని నేరవేర్చేందుకు అహర్నిషలు కృషి చేస్తుంటారు.. అలా.. గ్రామ సమస్యలకు మాటలతో కాదు. చర్యలతో పరిష్కారం చూపించిన సర్పంచ్ ఒకరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు.

Viral: చేతిలో కర్ర.. చింపాంజీ వేషం వేసి పరుగులు పెట్టిన సర్పంచ్.. ఎందుకో తెలుసా..?
Sarpanch

Edited By:

Updated on: Feb 02, 2026 | 10:44 AM

అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ సర్పంచ్ ఎన్నికలకు ముందు నేతలు ఎన్నో విషయాలను చెబుతారు.. అయితే.. కొందరు వాటిని నేరవేర్చేందుకు అహర్నిషలు కృషి చేస్తుంటారు.. అలా.. గ్రామ సమస్యలకు మాటలతో కాదు. చర్యలతో పరిష్కారం చూపించిన సర్పంచ్ ఒకరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. కోతుల బెడదతో అల్లాడుతున్న గ్రామ ప్రజలకు ఊరటనిచ్చేందుకు స్వయంగా చింపాంజీ వేషం వేసి రంగంలోకి దిగారు సర్పంచ్.. ప్రస్తుతం ఈ సర్పంచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన సర్పంచ్ మద్దుల రాజిరెడ్డి గ్రామంలో కోతుల సమస్యను ఎదుర్కొనేందుకు వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలోనే గ్రామ ప్రజలు కోతుల బెడద నుంచి తప్పించాలని కోరగా.. తాజాగా ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఆ హామీని అమలు చేసే దిశగా అడుగు వేశారు. తానే స్వయంగా చింపాంజీ వేషం ధరించి గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ కోతులను పరుగులు పెట్టించడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సర్పంచ్ స్థాయిలో ఉండి గ్రామ సమస్యకు ఇలా ప్రత్యక్షంగా స్పందించడం అరుదని పలువురు స్థానికులు ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. మాటలు కాదు పని చేసి చూపించిన ఈ సర్పంచ్ చర్య ఇప్పుడు నాగంపేట గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us