రూ 20కే చీర! ఎగబడ్డ మహిళలు..తొక్కిసలాట

మళ్లీ సేమ్ సీన్. వస్త్ర దుకాణాలు, నగల షాపుల వారు ప్రమోషన్ కోసం ఆఫర్లు పెట్టడం..వాటి కోసం మహిళలు ఎగబడటం..తొక్కిసలాట జరగడం. చాలా కామనైపోయింది.  ఈ తరహా ఘటన ఇప్పుడు పెద్దపల్లిలో జరిగింది. పెద్దపల్లిలోని ఓ వస్త్ర దుకాణం ఆషాడం బంపర్ ఆఫర్ కింద కేవలం రూ.20కే చీర అని ప్రచారం చేసింది. ఆ ఆఫర్ కూడా ఒక గంట పాటే ఉంటుందని చాటింది. ఇక ఏమైనా ఉందా?. పెద్దపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా […]

రూ 20కే చీర! ఎగబడ్డ మహిళలు..తొక్కిసలాట
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 04, 2019 | 6:34 PM

మళ్లీ సేమ్ సీన్. వస్త్ర దుకాణాలు, నగల షాపుల వారు ప్రమోషన్ కోసం ఆఫర్లు పెట్టడం..వాటి కోసం మహిళలు ఎగబడటం..తొక్కిసలాట జరగడం. చాలా కామనైపోయింది.  ఈ తరహా ఘటన ఇప్పుడు పెద్దపల్లిలో జరిగింది.

పెద్దపల్లిలోని ఓ వస్త్ర దుకాణం ఆషాడం బంపర్ ఆఫర్ కింద కేవలం రూ.20కే చీర అని ప్రచారం చేసింది. ఆ ఆఫర్ కూడా ఒక గంట పాటే ఉంటుందని చాటింది. ఇక ఏమైనా ఉందా?. పెద్దపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా వచ్చిన మహిళలు గురువారం ఉదయాన్నేషాప్ ముందు ప్రత్యక్షమయ్యారు. దీంతో దాదాపు  కి.మీ మేర పెద్ద క్యూ లైన్ ఏర్పడింది. అలా షాప్ తెరిచారో లేదో.. చీరల కోసం అంతా ఎగబడ్డారు. కొద్ది సేపు తొక్కిసలాట జరిగింది. వాళ్లను అదుపు చేయలేక షాపు నిర్వాహకులు చేతులెత్తేశారు. పరిస్థితి తేడావస్తే అసలు షాపు ఉంటుందో.. లేదో అనుకున్నాడో ఏమో? యజమాని షట్టర్ క్లోజ్ చేశాడు. పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. దీంతో ఎంతో ఆశపడి, ప్రయాసపడి అక్కడికి వచ్చిన మహిళలు నిర్వాహకులకు శాపనార్థాలు పెట్టి అక్కడినుంచి జారుకున్నారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..