చిన్నపెట్టుబడితో లాభాల పంటే.. అలాగని నమ్మితే ఖాతాలో సొమ్ము ఖతమే

డియర్ సిటిజన్స్ బీ అలెర్ట్.. ఇప్పుడు ఆన్ లైన్ ఫ్రాడ్ స్టార్స్ రెచ్చిపోతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్లను టార్గెట్ చేసి.. నిండా ముంచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ టెంప్టింగ్ మెసేజ్ వచ్చినా అస్సలు టెంప్ట్ అవ్వొద్దు. భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి.. ఒంటి మీద దుస్తులు కూడా మాయం చేస్తారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన 44 ఏళ్ల వ్యక్తికి.. స్టేట్ స్ట్రీట్ గ్లోబల్ అడ్వైజర్స్ కోఆర్డినేటర్‌ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. తాము కొన్ని స్టాక్స్ రిఫర్ చేస్తామని.. వాటిలో మనీ ఇన్వెస్ట్ చేస్తే లాభాల పంటే అని చెప్పుకొచ్చారు. వాళ్లు చెప్పిన వివరాలకు బాధితుడు టెంప్ట్ అయ్యాడు.

చిన్నపెట్టుబడితో లాభాల పంటే.. అలాగని నమ్మితే ఖాతాలో సొమ్ము ఖతమే
Stocks Crime
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 27, 2024 | 6:30 PM

డియర్ సిటిజన్స్ బీ అలెర్ట్.. ఇప్పుడు ఆన్ లైన్ ఫ్రాడ్ స్టార్స్ రెచ్చిపోతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్లను టార్గెట్ చేసి.. నిండా ముంచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ టెంప్టింగ్ మెసేజ్ వచ్చినా అస్సలు టెంప్ట్ అవ్వొద్దు. భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి.. ఒంటి మీద దుస్తులు కూడా మాయం చేస్తారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన 44 ఏళ్ల వ్యక్తికి.. స్టేట్ స్ట్రీట్ గ్లోబల్ అడ్వైజర్స్ కోఆర్డినేటర్‌ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. తాము కొన్ని స్టాక్స్ రిఫర్ చేస్తామని.. వాటిలో మనీ ఇన్వెస్ట్ చేస్తే లాభాల పంటే అని చెప్పుకొచ్చారు. వాళ్లు చెప్పిన వివరాలకు బాధితుడు టెంప్ట్ అయ్యాడు. ఒక నెల పాటు అప్పర్ సర్క్యూట్ స్టాక్‌లను కొనుగోలు చేశాడు. ఇందుకోసం దాదాపు రూ. 1,50,000 ఖర్చు చేశాడు. ఆ తర్వాత IPOలలో ఇన్వెస్ట్ చేస్తే.. భారీ లాభాలు ఉంటాయని నమ్మించారు. వారు చెప్పినట్లే బాధితుడు పలు ఖాతాల్లో డబ్బు జమ చేశాడు. కేటుగాడు.. వాట్సాప్ ద్వారా ఫలానా స్టాక్స్ కొన్నట్లు మెసేజ్ పంపాడు.

ఇలా నెల రోజులు గడిచిన తర్వాత బాధితుడు.. డబ్బును విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యాడు. దీంతో సదరు ట్రేడింగ్ కోఆర్డినేటర్‌‌ను అప్రోచ్ అవ్వగా.. ఇంకొంత పెట్టుబడి పెడితే డబ్బు విత్ డ్రా చేయగలమని చెప్పుకొచ్చాడు. దీంతో తాను మోసపోయినట్లు బాధితుడు గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోసగాళ్లు టెలిగ్రామ్, వాట్సాప్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ ద్వారా ఫేక్ ట్రేడింగ్ యాప్/వెబ్‌సైట్‌లను ప్రచారం చేస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ యాప్స్ SEBI ఆమోదాన్ని కలిగి ఉండవని చెబుతున్నారు. అధిక రాబడి వచ్చినట్లు స్క్రీన్‌షాట్‌లతో ప్రజలను చీట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత బాధితులును నమ్మించేందుకు కొద్ది మొత్తంలో నగదు జమ చేస్తారని.. నమ్మితే ఖాతాలో సొమ్ము ఖతమే అని హెచ్చరించారు. సైబర్ ఆర్థిక మోసానికి గురైనట్లయితే, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి డయల్ చేయడం ద్వారా లేదా cybercrime.gov.inని సందర్శించడం ద్వారా వెంటనే రిపోర్ట్ చేయాలని పోలీసులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో