Pawan Kalyan: వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీపై.. పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Pawan Kalyan on YS Sharmila: మాజీ ముఖ్యంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మరికాసేపట్లో వైఎస్ షర్మిల పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు వైఎస్ షర్మిల

Pawan Kalyan: వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీపై.. పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Updated on: Jul 08, 2021 | 12:47 PM

Pawan Kalyan on YS Sharmila: మాజీ ముఖ్యంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మరికాసేపట్లో వైఎస్ షర్మిల పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు వైఎస్ షర్మిల కుటుంబసభ్యులతో కలిసి.. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో షర్మిల పొలిటికల్ ఎంట్రీపై జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. వైఎస్ షర్మిల పార్టీకి స్వాగతం చెబుతున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు రావాలని కోరుకుంటున్నానన్నారు. ఉద్యమ, చైతన్య స్ఫూర్తి కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి, తెలంగాణలో పార్టీ బలోపేతంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను పగటి కలలు కనే వ్యక్తిని కాదని పవన్ పేర్కొన్నారు. తనకు రాజకీయ వారసత్వం చేతకాదని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని అనుకున్నా.. తనకు డబ్బు బలం లేదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ గురువారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.

Also Read:

YSR Jayanti-YS Sharmila: మహానేతకు విజయమ్మ, షర్మిల నివాళులు.. YSR ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు..

Hyderabad: కరోనా కేసులు కాస్త తగ్గాయో లేదు..ఇప్పుడు హైదరాబాదీలకు మరో సమస్య..