Papikondalu Tourism: గోదారమ్మ ఒడిలో అద్భుత ప్రయాణం.. మళ్లీ మొదలైన విహార యాత్ర.. పూర్తి వివరాలివే..

|

Dec 20, 2021 | 10:01 AM

Papikondalu Tourism: భద్రాచలం రామయ్యను దర్శించుకుని, అట్నుంచి అటు పాపికొండలు అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే, మీకో గుడ్‌ న్యూస్. భద్రాచలం

Papikondalu Tourism: గోదారమ్మ ఒడిలో అద్భుత ప్రయాణం.. మళ్లీ మొదలైన విహార యాత్ర.. పూర్తి వివరాలివే..
Papikondalu
Follow us on

Papikondalu Tourism: భద్రాచలం రామయ్యను దర్శించుకుని, అట్నుంచి అటు పాపికొండలు అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే, మీకో గుడ్‌ న్యూస్. భద్రాచలం టు పాపికొండలు విహార యాత్ర మళ్లీ మొదలైపోయింది. గోదారమ్మ ఒడిలో అద్భుత ప్రయాణం మళ్లీ మొదలైంది. సుదీర్ఘ విరామం తర్వాత పాపికొండలు విహారయాత్ర అట్టహాసంగా ఆరంభమైంది. ప్రకృతి అందాలను వీక్షిస్తూ గోదావరి అలలపై సాగే బోటు ప్రయాణం పునఃప్రారంభమైంది. అలసిన మనసులకు ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని పంచే పాపికొండలు యాత్రకు పర్యాటకులు అత్యాసక్తి చూపించారు. భద్రాచలం నుంచి పాపికొండలు వరకు సాగే ఈ బోటు ప్రయాణంలో తొలి రోజు వందమందికి పైగా పర్యాటకులు వెళ్లారు. గోదావరమ్మ ఒడిలో జల విహారం చేస్తూ పర్యాటకులంతా ఆనంద పరవశులైపోయారు.

గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకున్న అధికారులు, బోటు నిర్వాహకులు ఈసారి ప్రత్యేకమైన రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రతి లాంచీలో రెండు ఇంజిన్లను అమర్చారు. పర్యాటకులు కూర్చునే సీట్లను కదలకుండా సరికొత్తగా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికీ లైఫ్ జాకెట్ తప్పనిసరి చేయడంతోపాటు, ఒకేసారి ఐదారుగురిని రక్షించేలా గజ ఈతగాళ్లను, లైఫ్ బాయ్స్‌ను అందుబాటులో ఉంచారు. ప్రతి బోటులో 80మందికి మించకుండా టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు. ప్రస్తుతం 8 లాంచీలకే మాత్రమే పర్మిషన్ ఇచ్చిన అధికారులు… ప్రతి బోటులో పర్యవేక్షణకు పోర్ట్‌, పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్‌ నుంచి ఒక్కొక్కరు ఉండేలా చర్యలు చేపట్టారు. సెంట్రల్‌ ఆఫీస్ ద్వారా మాత్రమే టికెట్ ఇష్యూ చేసేలా కఠిన నిబంధనలు పెట్టారు. టోటల్‌గా పర్యాటకుల ప్రాణాలకు హై ప్రయారిటీ ఇస్తూ పాపికొండలు విహారయాత్ర పునఃప్రారంభమైంది. గోదారమ్మ ఒడిలో జల విహారం చేస్తూ ప్రకృతి అందాల మధ్య పరవశించిపోవాలనుంటే మీరు ఒకసారి ట్రై చేసేయండి మరి.

Also read:

Good Governance Week: నేడు దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్రం..

Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..