విషాదంలోనూ మానవత్వం.. అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ

జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని ఎన్నో కలలు కన్నాడు. వాటిని నెరవేర్చుకునే దిశలో ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ సాగిపోతున్నాడు. కోరుకున్న కోర్సులో చేరి ప్రతిభ చాటుకుంటున్నాడు. అయితే అతని ఆనందాన్ని..

విషాదంలోనూ మానవత్వం.. అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ
Organ Donation
Follow us

|

Updated on: Feb 26, 2022 | 10:00 AM

జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని ఎన్నో కలలు కన్నాడు. వాటిని నెరవేర్చుకునే దిశలో ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ సాగిపోతున్నాడు. కోరుకున్న కోర్సులో చేరి ప్రతిభ చాటుకుంటున్నాడు. అయితే అతని ఆనందాన్ని చూసి విధికి కన్ను కుట్టిందేమో. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడిని ఒడి చేర్చుకుంది. అయినా అతడు మాత్రం నెరవలేదు. తన అవయవాలను దానం చేసి.. వారి రూపంలో బతికే ఉన్నానని నిరూపించాడు. కన్నవారికి కడుపుకోత మిగిల్చి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్‌ గ్రామానికి చెందిన రాజకుమారస్వామి.. ఐటీఐ చదువుతున్నాడు. ఈ నెల 21న రత్నాపూర్‌ వద్ద బైక్ పై వెళ్తుండగా మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కుమారస్వామి తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు..బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని, మరో ఆస్పత్రికి సుకెళ్లాలని అక్కడి వైద్యులు కోరడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతనిలో చలనం లేకపోవడంతో వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధరించారు.

విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ బృందం ప్రతినిధులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అవయవదానం పట్ల రాజకుమారస్వామి తండ్రి రాజమల్లు, తల్లి మల్లమ్మ, బంధువులకు అవగాహన కల్పించారు. అవసరమైన వారికి అవయవాలు అందిస్తే.. మనవారు చనిపోయినా నలుగురి రూపంలో వారు బతికే ఉంటారని వివరించారు. దీనికి కుమారస్వామి తల్లిదండ్రులు అంగీకరించారు. గుండె, రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాలు సేకరించారు. గ్రీన్‌ఛానెల్‌ ద్వారా జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో కొన ఊపిరితో ఉన్న మహిళకు శస్త్రచికిత్స చేసి గుండెను అమర్చారు. మిగిలిన అవయవాలను వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అమర్చినట్లు జీవన్‌దాన్‌ ప్రతినిధులు వెల్లడించారు.

Also Read

Viral Video: ఈ మొసలి మహాముదురు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!

HPCL Recruitment: హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఇంకా రెండు రోజులే..

Healthy diet: రాత్రి పూట ఏది తింటే మంచిది.. భోజనమా, చపాతీనా..

Latest Articles