
గొట్టిపాటి రవికుమార్, భట్టి విక్రమార్క.. ఒకరు ఏపీకి. ఇంకొకరు తెలంగాణకు కరెంటు మంత్రులు. తుఫానుతో నష్టం ఎంత.. రిలీఫ్ ఆపరేషన్స్ ఎందాకా వచ్చాయని ఫోన్ చేసి గొట్టిపాటిని ఆరా తీశారు భట్టి. విపత్కర పరిస్థితుల్లో ఏపీకి తోడుగా ఉంటామని మాటిచ్చారు. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైతే సిబ్బందిని, సామగ్రినీ పంపుతామన్నారు. భట్టి పరామర్శకు థ్యాంక్స్ కూడా చెప్పారు గొట్టిపాటి. ఈ సమయంలో కచ్చితంగా ఇదొక మంచి పరిణామమే. దాయాది రాష్ట్రాల మధ్య ఈ మాత్రం పలకరింత గొప్ప విషయమే. కాకపోతే, గొట్టిపాటి నుంచి ధన్యవాదాలైతే తీసుకున్నారు గానీ, భట్టి గారి మనసు కూడా గజిబిజిగానే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని రౌండప్ చేసిన కరువు పరిస్థితి అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టూ స్టేట్స్.. టూ స్టోరీస్.. రెండూ ట్రాజెడీలే! టూ స్టేట్స్.. టూ స్టోరీస్.. రెండూ ట్రాజెడీలే! ఉభయ కుశలోపరికి ఛాన్సే లేదిక్కడ. ఆల్ ఈజ్ వెల్ అనుకునే సిట్యువేషనే లేదు. ఎందుకంటే, ఏ రాష్ట్రంలో కూడా యావన్మందీ క్షేమంగా లేరు. ఎండిన నేల, మండిన గుండె. ఒకవైపు తుఫాను విలయం.. మరోవైపు కరువు రక్కసి ప్రళయం. నేచర్ అడ్డం తిరిగి రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చి చెడామడా వాయిస్తోంది. అర్నబ్ తుఫానుతో చావు తప్పినా...