మంత్రులందు ఈ మంత్రి స్టైలే వేరయ.. జనంలో ఉండటం.. జనంతో ఉండటం ఆయనకు చాలా ఇష్టం.. అందుకే.. దారివెంట పోతుంటే ఎవరైనా కనిపిస్తే చాలు.. తన వాహనాన్ని ఆపి మరీ పలకరిస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో తాను సైతం చిన్నపిల్లాడిలా మారి.. వారితో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఎవరా? అని ఆలోచిస్తున్నారా? ఇంకెవరు.. మన తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన ప్రకృతి ప్రేమికులు.. మట్టి మనుషులతో ఇట్టే మమేకం అయ్యే గుణం ఆయన సొంతం.
అవును, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టైలే వేరు. జనంతో ఇట్టే కలిసిపోయే ఆయన..మృగశిర కార్తె సందర్భంగా చేపలు పట్టారు. జనగామజిల్లా కొడకండ్ల మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. రంగాపురం గ్రామంలో కొందరు ముదిరాజ్ కులస్థులతో కలిసి ఆయన చెరువుల పండుగలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం వలవేసి చేపలు సరదగా చేపలు పట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు. ఉచితంగా చేప పిల్లల పంపిణీ, వలలు, మత్స్యకార భవనాలను నిర్మిస్తోందన్నారు. కులవృత్తులవారికి చేయూత నిస్తోందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..