Telangana: రోడ్డు కంటే దిగువన ఇల్లు.. మరి ఆ ఇంటి యజమాని ఏం చేశాడో తెలుసా? ఓ లుక్కేసేయండి..!

|

Jun 04, 2022 | 8:46 AM

Telangana: కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. మానవుడికి సాధ్యం కానిదంటూ లేకుండా పోయింది. నిర్మల్ జిల్లాలో బీహారీ కూలీలు చేస్తున్న పనిని చూస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకొని

Telangana: రోడ్డు కంటే దిగువన ఇల్లు.. మరి ఆ ఇంటి యజమాని ఏం చేశాడో తెలుసా? ఓ లుక్కేసేయండి..!
Telangana
Follow us on

Telangana: కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. మానవుడికి సాధ్యం కానిదంటూ లేకుండా పోయింది. నిర్మల్ జిల్లాలో బీహారీ కూలీలు చేస్తున్న పనిని చూస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకొని నివ్వేరపోయి చూడాల్సిందే. ఏంటదో మీరే చూడండి. సాధారణంగా జాకీలు వాహనాల రిపేర్లకు, టైర్లు మార్చేందుకు ఉపయోగించడం అందరం చూశాం. కాని అదే జాకీలతో ఇంటి ఎత్తును పెంచవచ్చంటే నమ్ముతారా?. ఆదిలాబాద్ జిల్లాలో అదే జరిగింది. ఏకంగా ఏకంగా 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటిని 5ఫీట్ల ఎత్తు పెంచేందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించారు బీహారీ కూలీలు.

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం మున్యల్ గ్రామానికి చెందిన బద్ది లింగన్న గత 20 సంవత్సరాల క్రితం ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే కాలనుగుణంగా లింగన్న ఇల్లు రోడ్డుకు ఐదు అడుగులు క్రిందికి ఉండడంతో ఇంటిని జాకీల సహాయంతో పైకి లేపేందుకు.. బీహార్ కు చెందిన జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్, షిఫ్టింగ్ సర్వీసెస్ వారి సంప్రదించారు. 15 మంది కూలీల సాయంతో రెండు లక్షల ఇరవై వేల రూపాయలకు ఇంటిని 5ఫీట్ల ఎత్తుకు లేపేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఇప్పటికే 125 జాకీలతో పని మొదలెట్టారు. మూడు రోజుల్లో రెండు అడుగుల పైకి లేపినట్లు కార్మికులు తెలిపారు. మరో వారంలో ఐదు అడుగుల ఎత్తును కంప్లీంట్ చేస్తామని చెప్పారు బీహార్‌కు చెందిన కార్మికుడు కుమోధ్.

ఇంటిని ఐదు అడుగుల ఎత్తు లేపేందుకు జాకీలతో పాటు ఐరన్ ఛానల్లు, పట్టా, కర్ర గుట్కాలను ఉపయోగిస్తున్నారు కార్మికులు. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలలో కూడా బిల్డింగ్ లిఫ్టింగ్, షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయని కార్మికులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

House