Viral Video: మల్లారెడ్డితో అట్లుంటది మరి.. గోవాలో మాజీ మంత్రి విన్యాసాలు మామూలుగా లేవుగా.. సంచలన వీడియో..

| Edited By: Shaik Madar Saheb

Jan 09, 2024 | 6:35 PM

అధికారంలో ఉన్న లేకున్నా ఆయనలో క్రేజ్ ఏమాత్రం తగ్గదు. మొన్నటి దాకా మంత్రి.. ఇప్పుడు ఎమ్మెల్యే.. అప్పుడూ ఇప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అంతే.. మంత్రి, అయినా.. ఎమ్మెల్యే అయినా.. ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.. ఆయనే.. మల్లారెడ్డి.. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి..

Viral Video: మల్లారెడ్డితో అట్లుంటది మరి.. గోవాలో మాజీ మంత్రి విన్యాసాలు మామూలుగా లేవుగా.. సంచలన వీడియో..
Mallareddy
Follow us on

అధికారంలో ఉన్న లేకున్నా ఆయనలో క్రేజ్ ఏమాత్రం తగ్గదు. మొన్నటి దాకా మంత్రి.. ఇప్పుడు ఎమ్మెల్యే.. అప్పుడూ ఇప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అంతే.. మంత్రి, అయినా.. ఎమ్మెల్యే అయినా.. ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.. ఆయనే.. మల్లారెడ్డి.. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. సోషల్ మీడియా ఫాలోయింగ్ తగ్గట్టుగానే ఆయన కూడా కంటెంట్ ఇస్తూనే ఉంటారు. తాజాగా ఎలక్షన్స్ తర్వాత రిలాక్స్ కోసం 70 ఏళ్ల ఎమ్మెల్యే మల్లారెడ్డి గోవాకి వెళ్లారు. కొంతమంది నేతలతో గోవాలో ఎంజాయ్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు.

ఈ వయసులో కూడా మల్లారెడ్డి.. సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.. సముద్రంలో పారా స్లైడింగ్ చేస్తూ హుషారుగా కనిపించారు. అంతటితో ఆగకుండా.. అక్కడే బోటు నడిపి తెలుగు టూరిస్టులతో జై మల్లన్న అనిపించుకున్నారు.

వీడియో చూడండి..

మొన్న మోడీ లక్షదీప్ లో స్కూబా డ్రైవింగ్ చేసినట్లు.. గోవాలో మల్లారెడ్డి కూడా సేమ్ టు సేమ్ దింపేశారు. రిలాక్స్ కోసం గోవాలో ఎంజాయ్ చేస్తున్న మల్లారెడ్డి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..