వినాయక నిమజ్జన శోభాయాత్రలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి

జగిత్యాలలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న 24 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. పోలీసులు వెంటనే సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ..

వినాయక నిమజ్జన శోభాయాత్రలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి
Young Man Dies

Edited By:

Updated on: Sep 25, 2026 | 6:30 PM

వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడంతో జగిత్యాల పట్టణంలో విషాదం నెలకొంది. గురువారం రాత్రి పట్టణంలోని తులసినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తులసినగర్‌కు చెందిన తోపారపు జయంత్ (24) స్నేహితులతో కలిసి నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నాడు. పాడ్ బ్యాండ్ సౌండ్‌కు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా.. ఒక్కసారిగా కిందపడిపోయాడు. అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్‌ఐ కుమారస్వామి, ఇతర పోలీసులు వెంటనే స్పందించారు. జయంత్‌కు అక్కడికక్కడే సీపీఆర్ చేసి, పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసు వాహనంలో జగిత్యాల ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జయంత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిమజ్జన వేడుకల్లో సంతోషంగా పాల్గొంటున్న సమయంలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో శోభాయాత్రలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. జయంత్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరోవైపు నిమజ్జన వేడుకల్లో డీజేలు, అధిక బేస్‌తో కూడిన లౌడ్ మ్యూజిక్ వినియోగంపై పోలీసులు ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువకుడు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us