ఆకలితో అలమటించిన మేక పిల్ల.. పాలు ఇస్తూ.. అమ్మతనం పంచిన ఇటిక్యాల పాడి ఆవు!

అమ్మతనంలోని ఔన్నత్యాన్ని చాటిచెబుతోంది ఓ గోమాత. అమ్మ ప్రేమకు మూగజీవాలు అతీతం కాదని నిరూపించాయి. ఆకలితో అలమటిస్తున్న మేక పిల్లకు పాలిస్తూ లాలించింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి. మండలంలో అద్భుతాలు సృష్టిస్తున్నాయి ఇటిక్యాల పాడి ఆవులు. ఆవుల గొప్ప మనస్సుకు స్థానికులు ఫిదా అవుతున్నారు.

ఆకలితో అలమటించిన మేక పిల్ల.. పాలు ఇస్తూ.. అమ్మతనం పంచిన ఇటిక్యాల పాడి ఆవు!
Cow Feeding Milk To Goat Calf

Edited By:

Updated on: Feb 20, 2026 | 5:38 PM

అమ్మతనంలోని ఔన్నత్యాన్ని చాటిచెబుతోంది ఓ గోమాత. అమ్మ ప్రేమకు మూగజీవాలు అతీతం కాదని నిరూపించాయి. ఆకలితో అలమటిస్తున్న మేక పిల్లకు పాలిస్తూ లాలించింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి. మండలంలో అద్భుతాలు సృష్టిస్తున్నాయి ఇటిక్యాల పాడి ఆవులు. ఆవుల గొప్ప మనస్సుకు స్థానికులు ఫిదా అవుతున్నారు.

ఇటిక్యాల పాడి ఆవులు మరోసారి మానవత్వానికి మించిన తల్లి ప్రేమను చాటుకున్నాయి. మూడు రోజుల క్రితం తన దూడ కోసం ఓ తల్లి ఆవు ఆవేదనతో కన్నీరు పెట్టగా, తాజాగా మరో హృదయాన్ని హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. పాలు లేక ఆకలితో విలవిల్లాడుతున్న ఒక మేక పిల్లను చూసిన ఓ ఆవు, జాతి భేదం మరిచి తల్లి ప్రేమను పంచింది. తన బిడ్డలా అక్కున చేర్చుకుని పాలిచ్చి తల్లి ప్రేమను చూపింది. తన సొంత దూడ కాకపోయినా, ఆ చిన్న ప్రాణి ఆకలిని అర్థం చేసుకుని అమ్మతనం చాటుకుంది ఇటిక్యాల్ పాడ్‌కు చెందిన ఆవు.

తాజాగా ఇటిక్యాల్ పాడ్ లో పులు దాడిలో లేగ దూడ చనిపోగా‌‌.. తన బిడ్డ ఆచూకీని అటవీశాఖకు చూపి ఆదర్శంగా నిలిచింది ఓ ఆవు. ఇదే ప్రాంతానికి చెందిన మరో ఆవు.. తల్లి ప్రేమను మరోసారి చాటుకుని శభాష్ అనిపించుకుంది. ఈ తల్లి ఆవుల మమకారం ప్రతి ఒక్కరినీ కదిలించింది. మూగజీవుల ప్రేమకు సరిహద్దులు లేవని, మాతృత్వానికి మతం – జాతి అనే తేడాలు ఉండవని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. నిజమైన ప్రేమ అనేది పరస్పర సహకారంతోనే సాధ్యమని చాటి చెబుతున్నాయి ఇటిక్యాల పాడ్ ఆవులు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us