హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. ఆసియా టాప్ 100 కాఫీ షాపుల్లో చోటు దక్కించుకున్న రోస్టరీ కాఫీ హౌస్!

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యుత్తమంగా నిలిచిన టాప్ 100 కాఫీ షాప్‌ల జాబితాలో భారత్ నుండి ఎనిమిది కేఫ్‌లు స్థానం దక్కించుకున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రోస్టరీ కాఫీ హౌస్ కూడా చోటు సంపాదించడం విశేషం. కాఫీ ప్రియులకు అద్భుతమైన రుచులు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్న ఈ కేఫ్.. అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరి కీర్తిని ఇనుమడింపజేసింది. జైపూర్, ఢిల్లీ, ముంబై, చెన్నై, సూరత్ నగరాలతో పాటు హైదరాబాద్ కూడా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నిలవడం భారతీయ స్పెషాలిటీ కాఫీ రంగం సాధించిన అరుదైన విజయంగా నిపుణులు కొనియాడుతున్నారు.

హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. ఆసియా టాప్ 100 కాఫీ షాపుల్లో చోటు దక్కించుకున్న రోస్టరీ కాఫీ హౌస్!
Roastery Coffee House

Updated on: Nov 14, 2026 | 4:23 PM

భారతీయ కాఫీ సంస్కృతి ఇప్పుడు సరికొత్త మైలురాళ్లను తాకుతోంది. కేవలం సిగ్నేచర్ ఛాయ్‌లకే పరిమితం కాకుండా, ప్రపంచ స్థాయి స్పెషాలిటీ కాఫీలను అందిస్తూ మన దేశంలోని కేఫ్‌లు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాయి. తాజాగా వెలువడిన ది వరల్డ్స్ 100 బెస్ట్ కాఫీ షాప్స్ – ఆసియా పసిఫిక్ ర్యాంకింగ్స్‌లో భారతదేశం నుండి ఏకంగా ఎనిమిది అద్భుతమైన కేఫ్‌లు చోటు దక్కించుకున్నాయి. ఇందులో మన హైదరాబాద్‌లోని ప్రముఖ రోస్టరీ కాఫీ హౌస్ 74వ స్థానాన్ని దక్కించుకుని నగరవాసులకు గర్వకారణంగా నిలిచింది.

విస్తరిస్తున్న కాఫీ సంస్కృతికి ప్రతీక..

గతంలో స్పెషాలిటీ కాఫీ అనగానే బెంగళూరు, ముంబై వంటి నగరాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిధి చెరిగిపోయింది. జైపూర్‌లోని క్యూరియస్ లైఫ్ కాఫీ రోస్టర్స్‌ (39వ స్థానం) దేశం తరఫున అగ్రస్థానంలో నిలవగా.. ఢిల్లీ, సూరత్, చెన్నై, ముంబైలతో పాటు హైదరాబాద్‌లోని రోస్టరీ కాఫీ హౌస్ ఈ ప్రతిష్టాత్మక జాబితాలో సముచిత స్థానం సంపాదించింది.

ఇవి కూడా చదవండి

రోస్టరీ కాఫీ హౌస్ ప్రత్యేకత ఏమిటి?

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, ఇతర ప్రాంతాలలో ఉన్న రోస్టరీ కాఫీ హౌస్.. కేవలం కాఫీ అందించే చోటు మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన అనుభూతి. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన గార్డెన్ ఏరియా, ఆహ్లాదకరమైన వాతావరణం దీని ప్రత్యేకత. ఎస్టేట్-టు-కప్ విధానంలో నాణ్యమైన గింజలను సేకరించి, సువాసన వెదజల్లే సరికొత్త బ్రూలను ఇక్కడ అందిస్తారు. హాట్ కాఫీలతో పాటు ప్రత్యేకమైన కోల్డ్ బ్రూస్, చాక్లెట్ కాఫీ షేక్స్, కాంటినెంటల్ ఫుడ్ ఇక్కడికి వచ్చే ఫుడీలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్స్‌లో యువత, ఫ్యామిలీలతో ఈ కేఫ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.

భారతీయ కాఫీ పరిశ్రమకు దక్కిన గౌరవం..

సింగపూర్‌కు చెందిన అపార్ట్‌మెంట్ కాఫీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా.. ఆస్ట్రేలియా, జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, తైవాన్ దేశాలు ఈ రంగంలో ఆధిపత్యం చెలాయించాయి. ఇలాంటి కఠినమైన పోటీ మధ్య భారత్ నుంచి ఎనిమిది కేఫ్‌లు ఎంపిక కావడం మన దేశంలో కాఫీ కల్చర్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో తెలియజేస్తోంది. మొత్తానికి, గ్లోబల్ మ్యాప్‌లో హైదరాబాద్ మరోసారి తన పాగా వేసింది. మీరు కూడా కాఫీ ప్రేమికులైతే, ఈ వీకెండ్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రోస్టరీ కాఫీ హౌస్‌ను సందర్శించి ఆ సువాసనలను ఆస్వాదించండి!

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Loading...
Unable to load recommendations.
Follow Us