Viral Video: అసలైన విజయం అంటే ఇదే.. అమెజాన్ జాబ్ వదిలి క్యాబ్ డ్రైవర్‌గా హైదరాబాద్ టెక్కీ..

హైదరాబాద్‌కు చెందిన కుమార్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసిన ఆయన, మంచి జీతం ఉన్నప్పటికీ ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడంతో క్యాబ్ డ్రైవర్‌గా మారారు. డ్రైవింగ్‌పై ఉన్న ఆసక్తిని వృత్తిగా ఎంచుకుని, 2014 నుంచి ఇప్పటివరకు 23,600కు పైగా ట్రిప్పులు పూర్తి చేశారు. ప్రతిరోజూ కొత్త వ్యక్తులను కలవడం, వారి అనుభవాలు తెలుసుకోవడం తనకు ఆనందాన్ని ఇస్తోందని కుమార్ చెబుతున్నారు.

Viral Video: అసలైన విజయం అంటే ఇదే.. అమెజాన్ జాబ్ వదిలి క్యాబ్ డ్రైవర్‌గా హైదరాబాద్ టెక్కీ..
Amazon Employee To Uber Driver Viral Video

Edited By:

Updated on: Jun 17, 2026 | 11:56 AM

ఏసీ ఆఫీసులు, భారీ జీతాలు, కార్పొరేట్ హోదాలు.. ఇవే విజయానికి కొలమానాలుగా భావించే కాలమిది. అయితే అందరూ ఒకే రకంగా ఆలోచించరు. కొందరికి జీతం కంటే ఉద్యోగంలో ఆనందం ముఖ్యం. అలాంటి ఓ వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన కుమార్ ఒకప్పుడు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారు. మంచి జీతం, స్థిరమైన కెరీర్ ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం మరో దారిలో పయనించింది. డ్రైవింగ్ అంటే చిన్నప్పటి నుంచే ఉన్న ఇష్టాన్ని వృత్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. చివరకు కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి ఉబెర్ క్యాబ్ డ్రైవర్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ఆసక్తికర కథను సాఫ్ట్‌వేర్ డెవలపర్, కంటెంట్ క్రియేటర్ చేతనా సింగ్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో కుమార్‌తో జరిగిన సంభాషణను వీడియోగా రికార్డ్ చేసి షేర్ చేశారు. ఆ వీడియోలో కుమార్ తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వివరించారు.

“ప్రతి రోజు కొత్త వ్యక్తులను కలవడం, వారి అనుభవాలు వినడం, నగరాన్ని పూర్తిగా చుట్టేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో దొరకని సంతృప్తి డ్రైవింగ్‌లో దొరికింది” అని కుమార్ చెప్పారు. 2014లో ప్రారంభమైన ఈ ప్రయాణంలో ఆయన ఇప్పటివరకు 23,600కు పైగా ట్రిప్పులను పూర్తి చేశారు. ప్రయాణికుల నుంచి అత్యుత్తమ రేటింగ్‌లు అందుకుని ప్రముఖ క్యాబ్ సేవా సంస్థలో టాప్ డ్రైవర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

చేతనా సింగ్ షేర్ చేసిన వీడియో

ఈ వీడియో నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. “సమాజం ఏమనుకుంటుందన్న దాని కంటే మనకు నచ్చిన జీవితం గడపడమే అసలైన విజయం” అని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు “కుమార్ కథ తమ పాత కలలను మళ్లీ గుర్తు చేసింది” అంటున్నారు. డబ్బు, హోదా, విలాసవంతమైన జీవితం మాత్రమే విజయాన్ని నిర్ణయించవని… మనసుకు నచ్చిన పని చేస్తూ ఆనందంగా జీవించగలగడం కూడా అంతే గొప్ప విజయమని కుమార్ కథ మరోసారి గుర్తు చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us