Vegetable Prices: పండుగ వేళ సామాన్యులకు బిగ్ రిలీఫ్.. కూరగాయల ధరలు పడిపోయాయ్.. ఇవాళ ఎంతంటే..?

దీపావళి పండక్కి ముందు కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ధరలు పడిపోతున్నాయి. దీంతో పండుగ వేళ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. సాధారణంగా పండుగ సమయాల్లో డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు దిగజారుతున్నాయని చెప్పవచ్చు.

Vegetable Prices: పండుగ వేళ సామాన్యులకు బిగ్ రిలీఫ్.. కూరగాయల ధరలు పడిపోయాయ్.. ఇవాళ ఎంతంటే..?
Vegetable Prices

Updated on: Nov 03, 2026 | 12:15 PM

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. వంటిల్లో రోజూ ఉపయోగించే టమాటా, ఉల్లిపాయలు ధరలు అదుపులో ఉన్నాయి. మొన్నటివరకు వీటి ధరలు భగ్గుమనగా.. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. దీపావళి పండుగ సీజన్ క్రమంలో ధరలు చౌకకే దొరకడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. ఎల్‌నివో ప్రభావం వల్ల ఇటీవల ధరలు పెరిగాయి. కూరగాయలకు డిమాండ్ ఉండటంతో ధరలు పెరిగాయి. అయితే ఇప్పుడు పంట మార్కెట్‌కు వస్తుండటంతో సరఫరా పెరిగింది. ఈ కారణంతో ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఈ పరిణామం పండుగ వేళ సామాన్యుల ఇంటి బడ్జెట్‌ను తగ్గిస్తోంది. పండుగ సమయాల్లో ఇంట్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కిరాణా సరుకుల  అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇక రకరకాల వంటలు వడేందుకు కూరగాయల అవసరం ఎక్కువగా ఉంటుంది. ధరలు తగ్గడం పండక్కి ముందే ఊరటగా కల్గిస్తోంది.

హైదరాబార్‌లో కూరగాయల ధరలు..

కూకట్‌పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్‌లోని నవంబర్ 3వ తేదీన కిలో టమాట రూ. 29, వంకాయ రూ. 18, బెండకాయ రూ. 45, పచ్చిమిర్చి రూ. 45, బజ్జి మిర్చి రూ. 60, కాకరకాయ రూ. 35, బీరకాయ రూ. 35, క్యాబేజీ రూ. 13, బీన్స్ రూ. 55, క్యారెట్ రూ. 43, గోబీపువ్వు రూ. 25, దొండకాయ రూ. 23, చిక్కుడుకాయ రూ. 45, గోరుచిక్కుడు రూ. 35, బీట్‌రూట్ రూ. 19కు విక్రయిస్తున్నారు. ఇఖ క్యాప్సికమ్ రూ. 45, బంగాళాదుంప రూ. 19, కీర (లోకల్) రూ. 23, కీర (ఇటాలియన్) రూ. 35, దోసకాయ రూ. 18, సొరకాయ రూ. 20, పొట్లకాయ రూ. 22 పలుకుతున్నాయి. అలాగే కిలో కంద రూ. 35, ఉల్లికాడలు రూ. 55, ఉల్లిగడ్డ రూ. 40, పచ్చి మామిడికాయ ఒక్కొక్కటి రూ. 15-20, అరటికాయ ఒక్కొక్కటి రూ. 9-10, చామగడ్డ రూ. 35, ముల్లంగి ఒక్కొక్కటి రూ. 6-8, చిలగడదుంప రూ. 35, గుమ్మడికాయ రూ. 25, నిమ్మకాయలు డజను రూ. 50-60కు లభిస్తున్నాయి. అలాగే మునగకాయలు ఒక్కొక్కటి రూ. 8-10, బొప్పాయి రూ. 50, పుట్టగొడుగులు (200 గ్రా.) రూ. 50, ఎండుమిర్చి రూ. 280, పాత అల్లం రూ. 180, కొత్త అల్లం రూ. 120, వెల్లుల్లి రూ. 260, చింతపండు రూ. 160, పండుమిర్చి రూ. 80, ఉసిరి రూ. 45, కరివేపాకు రూ. 80, పర్వల్ రూ. 28, పల్లికాయ రూ. 55, లోబియా రూ. 28, ఆగాకరకాయ కిలో రూ. 85గా ఉన్నాయి.

విజయవాడలో నేటి రేట్లు ఇవే..

విజయవాడలోని రైతు బజార్లలో కిలో టమాట రూ.39, బెండ రూ.24, పచ్చిమిర్చి రూ.34, కాకర రూ.34, క్యాబేజీ రూ.24, క్యారెట్ రూ.45, దొండ రూ.24, బంగాళదుంప రూ.25, ఉల్లిపాయలు రూ.39, గోరుచిక్కుళ్లు రూ.32, దోస రూ.20, చామదుంప రూ.34, అల్లం రూ.76, కంద రూ.34, బీట్ రూట్ రూ.36, కీరదోస రూ.46, బీన్స్ రూ.105, క్యాప్చికం రూ.60, చింతకాయలు రూ.100 పలుకుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us