Vegetable Prices: భాగ్యనగరవాసులకు షాక్.. కొండెక్కిన కూరగాయలు..! ఏది పట్టినా వంద కట్టాల్సిందే..!

హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎర్రగడ్డ రైతు బజార్‌లో ఎంటరవ్వగానే.. అక్కడి ధరల పట్టిక చూస్తే.. కొనడానికి వెళ్లిన వాళ్లకు మైండ్‌ బ్లాంక్‌ అవుతోంది. టాప్‌ టు బాటమ్‌..అదే రేటు పలుకుతున్నాయి. సంచి నిండా వెజిటబుల్స్‌ తెద్దామనుకుని వెళ్లిన వాళ్లు..ఉన్న డబ్బులతో హ్యాండ్‌ బ్యాగుల్లో కూరగాయలను సర్దుకుని రావాల్సిన పరిస్థితి.. అంత పిరెమయ్యాయి మరి..

Vegetable Prices: భాగ్యనగరవాసులకు షాక్.. కొండెక్కిన కూరగాయలు..! ఏది పట్టినా వంద కట్టాల్సిందే..!
Vegetables Price

Updated on: Jun 26, 2023 | 8:35 PM

అబ్బబ్బబ్బా.. ఏం రేట్లురా నాయనా.. ఈ ధరలు ఎక్కడా చూడలేదు.. అయినా వానాకాలంలో కూడా ఇంత మండిపోతున్నాయేంట్రా..హైదరాబాద్‌లో రైతు బజార్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరి నోట ఇదే మాట వినిపిస్తోంది. కూరగాయలన్నీ రాశులు పోసినట్లుగా ఊరిస్తున్నా ఏదీ కొనలేని పరిస్థితి.. అన్నీ సెంచరీ ఎప్పుడో దాటేశాయి..టమాటాకైతే అస్సలు మనసు లేదు.. సాయంత్రం దాకా కిలో 80 రూపాయలుంది. రాత్రయ్యేసరికి వంద కొట్టేసింది. మంగళవారానికి వందకూ మంగళం పాడేసి రూ.120కి వెళ్లినా ఆశ్చర్యం లేదని రైతు బజార్‌ టాక్‌.

ఇక, మిర్చి 120 రూపాయల మార్క్‌ ఎప్పుడో దాటేసింది. ఇవి మాత్రమే కాదు..బీరకాయ, బీన్స్‌, వంకాయ ఏవి కొనాలన్నా జేబులకు చిల్లులు తప్పడం లేదు. నోరు కట్టేసుకుందామంటే కుదరదు..కనీసం చారు, సాంబారుతో కానిచ్చేద్దామనుకున్నా..ఒక్క టమాటా అయినా వేయకపోతే రుచి పచి ఉండదు.. సో.. సాంబారు నీళ్లకూ కష్టకాలమొచ్చిందిరా అని జనం అల్లాడిపోతున్నారు. కాగా, ఒకప్పుడు కూరగాయలతో సంచి నిండిపోయేది.. కానీ ఇప్పుడు వెజిటబుల్స్‌ను హ్యాండ్‌ బ్యాగుల్లో సర్దాల్సి వస్తోంది.. మరి అంత పిరెం అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us