Uppal Balu: అక్కడ కూడా ఎందుకు బాలు ఈ పనులు.. తప్పు కదా..!

ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందిన అనంతగిరి ఘాట్ రోడ్డుపై సోషల్ మీడియా కోసం చేసిన ప్రమాదకర స్టంట్‌లు వివాదానికి దారితీశాయి. వైరల్ వీడియోలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Uppal Balu: అక్కడ కూడా ఎందుకు బాలు ఈ పనులు.. తప్పు కదా..!
Uppal Balu

Edited By:

Updated on: Jun 27, 2026 | 7:56 AM

ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందిన అనంతగిరి పుణ్యక్షేత్రంలో సోషల్ మీడియా కోసం చేసిన ప్రమాదకర స్టంట్‌లు వివాదానికి దారితీశాయి. అనంతగిరి ఘాట్ రోడ్డుపై కారు పైభాగంపై కూర్చొని విన్యాసాలు చేసినట్లు కనిపిస్తున్న ఉప్పల్ బాలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై వికారాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు సందర్శించే పవిత్రమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి చర్యలు యువతకు తప్పు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో, ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సాధారణ పర్యాటకులు చిన్న కెమెరాలతో ఫొటోలు లేదా వీడియోలు చిత్రీకరించినా నిబంధనల పేరుతో చర్యలు తీసుకుంటారని, అయితే బహిరంగంగా స్టంట్‌లు చేస్తూ వీడియోలు చిత్రీకరించిన వారిపై ఎందుకు స్పందించలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అనంతగిరి ఘాట్ రోడ్డుపై ఉప్పల్ బాలు, అతని అనుచరులు చేసినట్లు ప్రచారం జరుగుతున్న ఈ స్టంట్‌లపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను ప్రోత్సహించకుండా కఠినంగా వ్యవహరిస్తేనే పర్యాటక ప్రాంతాల గౌరవం, భద్రత పరిరక్షించబడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు లేదా అటవీ శాఖ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రామాణికత, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై అధికారుల విచారణ అనంతరం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వీడియో దిగునవ చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us