Hyderabad: ‘భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత యువతపై ఉంది’.. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ..

|

Feb 26, 2022 | 1:55 PM

Hyderabad: భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంపదను ప్రంపంచానికి చాటి చెప్పాల్సిన భాద్యత యువతపై ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంగ్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు. భారతీయ చరిత్రను వక్రీకరించి ప్రపంచం ముందు...

Hyderabad: భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత యువతపై ఉంది.. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ..
Dattatreya Hosabale
Follow us on

Hyderabad: భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంపదను ప్రంపంచానికి చాటి చెప్పాల్సిన భాద్యత యువతపై ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంగ్‌ (RSS) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు. భారతీయ చరిత్రను వక్రీకరించి ప్రపంచం ముందు మన సంస్కృతిని నవ్వుల పాలు చేస్తున్న వారికి చరిత్రకారులు, పరిశోధకులు సరైన సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన నేతాజీ పుస్తకావిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దత్తాత్రేయ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ పాత్రికేయులు, రచయిత ఎం.వీ.ఆర్‌ శాస్త్రి రచించిన నేతాజీ పుస్తకావిష్కరణ చేసిన తర్వాత దత్తాత్రేయ మాట్లాడుతూ.. ‘మీరు నాకు రక్తం ఇస్తే, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను అన్న సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని నింపిన నేతాజీ పుస్తకాన్ని యువత తప్పక చదవాలి. నేతాజీ సాహసం, దేశభక్తిని వెలకట్టలేనివి. నేతాజీ సోషలిస్ట్ అనే చెప్పుకునే వామపక్షాల నేతలు స్వామి వివేకానంద నుంచి స్ఫూర్తిని పొందారు. విదేశీయుల ద్వారా చరిత్రలో వక్రీకరించిన అంశాలను రచయిత శాస్త్రి వెలుగులోకి తెచ్చి యువతకు నిజమైన స్ఫూర్తిని అందించారు’ అని చెప్పుకొచ్చారు.

ఇక ఈ సందర్భంగా నేజాతీ పుస్తక రచయిత ఎం.వీ.ఆర్‌ శాస్త్రి మాట్లాడుతూ.. ‘సుభాష్ చంద్రబోస్ ఆగస్టు 18,1945 లో టైవాన్ టోక్యో మీదుగా ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు. గత ప్రభుత్వాలు కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నాయని ఇప్పటికైనా ఆయన మరణాన్ని ధృవీకరించాలి’ అని డిమాండ్ చేశారు. నేతాజీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలోనే రామకృష్ణ మఠం శితికంఠనంద స్వామి, జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, ప్రజ్ఞాభారతి పద్మశ్రీ హనుమాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Bheemla Nayak: విదేశాల్లోనూ దుమ్మురేపుతోన్న భీమ్లా నాయక్‌.. ప్రివ్యూ స్క్రీనింగ్స్‌తోనే ఎంత రాబట్టిందో తెలుసా?

పాత యజమానిపై ఒంటె ప్రేమ !! ప్రేమగా కౌగిలించుకుంది.. వీడియో

HPCL Recruitment: హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఇంకా రెండు రోజులే..