కూకట్పల్లి దగ్గర ఉన్న కేబీహెచ్‌బీ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న భాగ్యనగర్ బస్ స్టాప్ కేంద్రంగా అసాంఘిక చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడిందంటే చాలు ఇక్కడ కొంతమంది యువతులు గుంపులుగా చేరి వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. కొందరు యువతులు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు.
స్థానికులు కొంతమంది పోలీసులకు ఈ వ్యవహారంపైన ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్పల్లి పోలీసులతోపాటు షీ టీమ్స్, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 50 మంది పోలీసులు పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించి 31 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చీకటి వేళల్లో బస్ స్టాప్‌లో ఉండే వారిని టార్గెట్ చేస్తూ వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల ఆపరేషన్‌లో వీళ్ళందర్నీ అదుపులోకి తీసుకొని కూకట్పల్లి తహసీల్దార్ ముందు హాజరు పరిచారు. గతంలో సైతం కూకట్పల్లి పోలీసులు ఇలాంటి ఆపరేషన్‌ను నిర్వహించారు. ఇప్పుడు 31 మందిని అదుపులోకి తీసుకోగా గతంలో 22 మందిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందర్నీ కూకట్పల్లి తహసిల్దార్ ముందు హాజరు పరిచి బైండోవర్ చేశారు. మరోసారి వీరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ నిర్వహించారు.