Laptop Charging: ఫోన్‌, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారా?.. ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకు పుట్టాల్సిందే..!

Laptop Charging: ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ విషయంలో అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తుంటారు. రామంతాపూర్ హాస్టల్ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఛార్జింగ్ విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా అగ్నిప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉందనే హెచ్చరికను మాత్రం ఈ ఘటన..

Laptop Charging: ఫోన్‌, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారా?.. ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకు పుట్టాల్సిందే..!
Laptop Charging

Edited By:

Updated on: Aug 16, 2026 | 9:44 PM

Laptop Charging: చెప్పడానికి చిన్న ఘటనలా అనిపించొచ్చు.. కానీ వినడానికి, చూడటానికి మాత్రం ఆందోళన కలిగించే విషయం. మనం రోజూ ఉపయోగించే ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ పెట్టే సమయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదానికి దారితీయొచ్చని హైదరాబాద్‌లో జరిగిన తాజా ఘటన మరోసారి గుర్తుచేసింది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్‌లో ఉన్న నెస్ట్ హాస్టల్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సమయంలో అధిక వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తేల్చారు

ఛార్జింగ్ పెట్టారు.. ఒక్కసారిగా మంటలు

హాస్టల్‌లో ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌లో ఉండగా అది వేడెక్కి మంటలు వచ్చినట్లు ప్రత్యేక్ష సాక్షులు చెప్తున్నారు. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన స్వల్ప అగ్నిప్రమాదంతో ముగియడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ల్యాప్‌టాప్‌లోనే సమస్య వచ్చిందా? ఛార్జర్ లేదా బ్యాటరీ వేడెక్కిందా? విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణమా? అన్నది అధికారులు టెక్నిల్‌గా విచారణ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: Traffic Lights: ట్రాఫిక్ లైట్లలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు? దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఇవే!

మీ ల్యాప్‌టాప్ కూడా ఛార్జింగ్‌లో వేడెక్కుతోందా?

ఈ ఘటన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ విషయంలో అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ను బెడ్, దిండు, దుప్పటి వంటి వేడిని బయటకు వెళ్లనివ్వని ఉపరితలాలపై ఉంచి ఛార్జింగ్ చేయకుండా గాలి ప్రసరణ ఉండే గట్టి ఉపరితలంపై ఉంచడం మంచిది. దెబ్బతిన్న వైర్లు, నాసిరకం లేదా సరిపోని ఛార్జర్లు ఉపయోగించకపోవడం, బ్యాటరీ అసాధారణంగా వేడెక్కినా లేదా ఉబ్బినట్లు కనిపించినా వెంటనే వినియోగాన్ని నిలిపివేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువసేపు పరికరాలను పర్యవేక్షణ లేకుండా ఛార్జింగ్‌లో వదిలేయకుండా ఉండటం కూడా సురక్షితం.

రామంతాపూర్ హాస్టల్ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఛార్జింగ్ విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా అగ్నిప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉందనే హెచ్చరికను మాత్రం ఈ ఘటన మరోసారి ముందుకు తెచ్చింది.

 

ఇది కూడా చదవండి: Gold Price: బంగారం రూ.3 లక్షలు.. వెండి రూ.6 లక్షలు దాటుతుందా..? మరో సంచలన ప్రకటన..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us