పత్తి, కంది పండించే రైతులకు కేసీఆర్ శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలో పత్తి, కంది పంట పండించే రైతులకు కేసీఆర్ శుభవార్త తెలిపారు. ఎంత పండించినా కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కందికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని.. 15 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని ఆయన సూచించారు. ఇక పత్తి పండించే రైతులకు కేసీఆర్ కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. ఇక రెండు మూడు రోజుల్లో  స్వయంగా తానే రైతులకు […]

పత్తి, కంది పండించే రైతులకు కేసీఆర్ శుభవార్త..!
Follow us

| Edited By:

Updated on: May 18, 2020 | 8:43 PM

తెలంగాణ రాష్ట్రంలో పత్తి, కంది పంట పండించే రైతులకు కేసీఆర్ శుభవార్త తెలిపారు. ఎంత పండించినా కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కందికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని.. 15 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని ఆయన సూచించారు. ఇక పత్తి పండించే రైతులకు కేసీఆర్ కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. ఇక రెండు మూడు రోజుల్లో  స్వయంగా తానే రైతులకు సూచనలు చేయాలని భావిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం ఏదో ఒక ఛానల్‌లో లైవ్ ఇంటరాక్షన్‌కు రెడీ అవుతానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని రైతులందరికీ అప్పుల్లేకుండా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని కేసీఆర్ అన్నారు.

Read This Story Also: వర్షాకాలంలో రైతులు ఆ పంటను వేయకండి: కేసీఆర్

Latest Articles