గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు..పొద్దున్నకు శవమై..

కొండాపూర్‌ పరిధిలోని ఓయో హోటల్ రూమ్‌లో ఓ యువకుడి అనుమానాస్పద మరణం కలకలం సృష్టిస్తోంది. పోలీసులు అతనిది సూసైడ్‌గా భావిస్తున్నప్పటికి, కుటుంబ సభ్యులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. వివరాల్లోకి వెళ్లే.. వరప్రసాద రావు(21) అలియాస్ సన్నీ అనే వ్యక్తి సనత్‌ నగర్‌లో గల శివాజీనగర్‌లో నివశిస్తున్నాడు.  హైటెక్ సిటీలోని ఓ హోటల్‌లో డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి  కొండాపూర్‌లోని ఓయో హోటల్ రూమ్‌కి వెళ్లాడు. రాత్రి 11 గంటల […]

గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు..పొద్దున్నకు శవమై..

Updated on: Jan 18, 2020 | 7:46 PM

కొండాపూర్‌ పరిధిలోని ఓయో హోటల్ రూమ్‌లో ఓ యువకుడి అనుమానాస్పద మరణం కలకలం సృష్టిస్తోంది. పోలీసులు అతనిది సూసైడ్‌గా భావిస్తున్నప్పటికి, కుటుంబ సభ్యులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. వివరాల్లోకి వెళ్లే.. వరప్రసాద రావు(21) అలియాస్ సన్నీ అనే వ్యక్తి సనత్‌ నగర్‌లో గల శివాజీనగర్‌లో నివశిస్తున్నాడు.  హైటెక్ సిటీలోని ఓ హోటల్‌లో డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి  కొండాపూర్‌లోని ఓయో హోటల్ రూమ్‌కి వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో అతని తల్లి ఫోన్ చేస్తే ప్రెండ్స్‌తో ఉన్నానని చెప్పాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు. శుక్రవారం సాయంత్రం వరకు అతడు బయటకు రాలేదు. హోటల్ సిబ్బంది ప్రయత్నించినా లోపలి నుంచి సమాధానం రాలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కి వచ్చిన పోలీసులు రూమ్ డోర్లు బలవంతంగా ఓపెన్ చెయ్యగా..లోపల సన్నీ విగతజీవిగా కనిపించాడు. స్పాట్‌లో ఎటువంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. సన్నీ తండ్రి అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి..అని కోణాల్లో విచారణ చేపట్టారు. అతని గర్ల్‌ప్రెండ్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us