AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!

Hyderabad drinking water supply disruption: నగరవాసులకు హైదరాబాద్ జలమండిలి బోర్డు కీలక సూచనలు జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుందని ప్రకటించింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (KDWSP) ఫేజ్-II పరిధిలో అత్యవసర మరమ్మతు పనులు చేపట్టనుండటంతో ఈ అంతరాయం కలగనుందని స్పష్టం చేసింది. కాబట్టి ఏఏ ప్రాంతాల్లో నీటికి అంతరాయం ఏర్పడనుందో ఇక్కడ తెలుసుకోండి.

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!
, Hyderabad Drinking Water Supply Disruption
Anand T
|

Updated on: Oct 03, 2026 | 6:41 PM

Share

హైదరాబాద్‌ వాసులకు జలమండలి బోర్డు కీలక సూచనలు జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి అంతరాయం ఏర్పడనున్నట్టు తెలిపారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్–IIలో భాగంగా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వుల మార్పిడితో పాటు, స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ నివారణ పనులను అధికారులు చేపట్టనున్నారు.

ఈ పనులు 05.10.2026, సోమవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై, 06.10.2026 మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ 36 గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడం లేదా పాక్షికంగా రావడం, మరికొన్ని చోట్ల తక్కువ సరఫరా జరిగే అవకాశం ఉందని తెలిపారు.

నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

ముఖ్యంగా నగరంలోని ఆదిబట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్‌ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్, హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్ , పద్మారావునగర్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.

అలాగే బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, వైశాలీనగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్‌పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్‌నగర్‌లో కూడా నీటి సరఫరా ఆగిపోతుందని ప్రకటించారు.

కాబట్టి.. మరమ్మతలు పూర్తయి.. నీటి సరఫరా యధావిధిగా కొనసాగేంత వరకు ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us