Hyderabad : హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. ఎప్పటివరకంటే?

హైదరాబాద్‌లోని వాహనదారులకు నరగ ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని మెహదీపట్నం బస్‌స్టాప్ వద్ద ఏర్పాటు చేస్తున్న స్కైవార్ నిర్మాణ పనుల నేపథ్యంలో రెండ్రోజుల పాటు అర్థరాత్రి నుంచి ఉదయం 6గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు.

Hyderabad : హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. ఎప్పటివరకంటే?
Hyderabad Traffic

Updated on: Apr 22, 2026 | 10:36 AM

నగరంలోని వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. మెహదీపట్నం రైతుబజార్‌ ప్రాంతంలో సికింద్రాబాద్ బస్సుల నిలిపివేత వైపు బస్టాప్ వద్ద జరుగుతున్న స్కైవాక్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించి వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చూడడానికి ట్రాఫిక్ మళ్లింపులు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కాబట్టి బుధవారం, గురువారం రోజు అర్ధరాత్రి 00:00 గంటల నుండి ఉదయం 06:00 గంటల వరకు ఈ క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ప్రజలకు సూచించారు.

ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే

మాసబ్ ట్యాంక్ నుండి రేతిబౌలి వైపు వెళ్లే వారు: మాసబ్ ట్యాంక్, ఎన్.ఎమ్.డి.సి (NMDC), ఎస్.డి కంటి ఆసుపత్రి వైపు నుండి రేతిబౌలి-నానల్ నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పి.వి.ఎన్.ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 2, 3 వద్ద మళ్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ వాహనాలు మెరాజ్ కేఫ్ – రైట్ – మెహదీపట్నం పిల్లర్ నంబర్ 15 వద్ద మీదుగా ప్రయాణించి తిరిగి సాధారణ మార్గంలో చేరవచ్చని సూచించారు.

టోలిచౌకి నుండి మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే వారు:

ఇక టోలిచౌకి, లంగర్ హౌస్, అత్తాపూర్ నుండి నానల్ నగర్-రేతిబౌలి మీదుగా మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పి.వి.ఎన్.ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 23 దగ్గర ఉన్న ‘యు’ టర్న్ వద్ద మళ్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ వాహనాలు వ్యతిరేక దిశలో ప్రయాణించి, పిల్లర్ నంబర్ 4, 5 వద్ద తిరిగి సాధారణ మార్గంలోకి వెళ్లవచ్చని సూచించారు

ప్రయాణీకులకు విజ్ఞప్తి

వాహనదారులు ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ ఫేస్‌బుక్ పేజీ (facebook.com/HYDTP) లేదా ట్విట్టర్/ఎక్స్ ఖాతా (@HYDTP) ను అనుసరించవచ్చని తెలిపారు. ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయాలని సూచించారు. పౌరులందరూ ఈ ట్రాఫిక్ మళ్లింపులను గమనించి, తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us