Hyderabad: జూబ్లిహిల్స్‌లో షాకింగ్‌ సీన్‌.. కళ్ల ముందే కాలి బూడిదైన BMW కారు! వీడియో వైరల్

నిన్న మొన్నటి వరకు వేసవి వేడి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎండ ధాటికి రోడ్లపై వాహనాల్లో మంటలు చెలరేగి ఎక్కడపడితే అక్కడే కాలిబూడిదై పోయాయి. ఇదంతా వేసవి ప్రభావం అని అనుకున్నారంత. కానీ ప్రస్తుతం అలాంటి వేడి పరిస్థితులు లేకపోయినా వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఏదో చిన్న బ్రాండ్‌ వాహనం అయితే ఇంతగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన..

Hyderabad: జూబ్లిహిల్స్‌లో షాకింగ్‌ సీన్‌.. కళ్ల ముందే కాలి బూడిదైన BMW కారు! వీడియో వైరల్
BMW Car Catches Fire
Follow us

|

Updated on: Jun 16, 2024 | 8:28 AM

జూబ్లిహిల్స్‌, జూన్‌ 16: నిన్న మొన్నటి వరకు వేసవి వేడి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎండ ధాటికి రోడ్లపై వాహనాల్లో మంటలు చెలరేగి ఎక్కడపడితే అక్కడే కాలిబూడిదై పోయాయి. ఇదంతా వేసవి ప్రభావం అని అనుకున్నారంత. కానీ ప్రస్తుతం అలాంటి వేడి పరిస్థితులు లేకపోయినా వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఏదో చిన్న బ్రాండ్‌ వాహనం అయితే ఇంతగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బీఎమ్‌డబ్ల్యూ కారు కాలిపోవడం చర్చణీయాంశంగా మారింది. ఈ సంఘటన జూబ్లిహిల్స్‌లోని నందగిరి హిల్స్ మెయిన్ రోడ్డు పై శనివారం (జూన్‌ 15) చోటు చేసుకుంది.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నడ్డిరోడ్డుపై శనివారం బీఎండబ్ల్యూ కారు దగ్దమైంది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోడ్డు పక్కన కారు ఆపి, అందులోని వారంతా దిగిపోయారు. అనంతరం క్షణాల వ్యవధిలోనే కారు కాలి బూడిదైపోయింది. సాధారణంగా ఇది బిజీ రోడ్డు కావడంతో భారీగా రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఫిల్మ్‌నగర్‌, ఒమేగా ఆసుపత్రి నుంచి నందగిరి హిల్స్‌ వరకు గంటలపాటూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జాంలో ఫైర్ ఇంజన్లు చిక్కుకోవడంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మంటలను అదుపు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles