
వామ్మో ఉప్పల్‌లో చిరుత సంచారం అంటూ.. నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది.. దీని గురించి ఆరా తీస్తే.. ఏఐ అసలు గుట్టు బయటపడింది.. ఉప్పల్-నాగోల్ పరిధిలో చిరుత పులి లేదు. ఆ ఏరియాలో ఎక్కడా కూడా చిరుత సంచరించడం లేదు. పబ్లిక్ భయపడాల్సిన అవసరం లేదు.. ఉప్పల్-నాగోల్ పరిధిలో చిరుత పులి సంచారం అంతా హంబక్ అంటూ పోలీసులు తెలిపారు. AIతో కాలనీల్లో చిరుత సంచరిస్తున్నట్లు ఫోటో సృష్టించిన ఓ ఆకతాయి దానిని వైరల్ చేశాడు.. ఫతుల్లాగూడ సమీపంలో అంటూ చాలా సహజంగా కనిపించేలా చిరుత ఫోటో క్రియేట్ చేశాడు. లోకల్ గ్రూప్స్‌లో వైరల్ అవ్వడంతో ఉప్పల్ – నాగోల్ ప్రాంత వాసులు హడలెత్తిపోయారు. ఫోటోకు ఫోజులిస్తున్నట్లుగా చిరుత కనిపించడంతో అటవీశాఖ పోలీసుల్లో డౌట్ వచ్చింది. లా అండర్ ఆర్డర్ పోలీసుల సాయంతో టెక్నాలజీ వాడి ఆరా తీస్తే నిందితుడు పట్టుబడ్డాడు.. తాగిన మత్తుల్లో AI ఫోటో క్రియేట్ చేసినట్లు పోలీసుల ఎదుట చెప్పాడు.
పనిగట్టుకుని ఆకతాయి పని చేసి అడ్డంగా దొరికిపోయాడు సచిన్. ఉప్పల్‌లో ఓ స్థలాన్ని ఫోటో తీసి ఆ తర్వాత దాంట్లో చిరుతను యాడ్ చేశాడు సచిన్. ఫోటోను వైరల్ చేయడంతోపాటు తాను చిరుతను చూశానని ఆయనే ఎమర్జెన్సీ నెంబర్ 112కి కాల్ చేసి చెప్పాడు. రిస్క్ ఎందుకులే అని అటవీశాఖ సాయంతో ఆ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. అయితే ఆ ఫోటోలో ఉన్న చిరుత రకం అసలు మన ఏరియాలోనే ఉండదు అని వాళ్లు క్లారిటీ ఇవ్వడంతో.. స్వయంగా తాను చూశానన్న సచిన్‌ని ఆరా తీశారు. సీన్ కట్ చేసి తాగి చేశాను సర్ అంటూ సచిన్ తన సైకోయిజాన్ని బయటపెట్టాడు..
అయితే.. ఇలాంటి ఘటనలపై పోలీసులు కటిన చర్యలు తీసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది.
Uppal Leopard News Fake
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..