Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. సెకన్లలోనే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవచ్చు.. అందుబాటులోకి కొత్త ఆప్షన్..

ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్‌లైన్‌లో సులువుగా చెల్లించవచ్చు. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పేటీఎం యాప్ ద్వారా, జీహెచ్‌ఎంసీ వెబ్ సైట్ ద్వారా ఈజీగా చెల్లించే సౌకర్యం అందుబాటులో ఉంది. తాజాగా జీహెచ్‌ఎంసీతో పేటీఎం భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా..

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్.. సెకన్లలోనే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవచ్చు.. అందుబాటులోకి కొత్త ఆప్షన్..
money

Updated on: Apr 01, 2026 | 4:42 PM

మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా..? ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలనుకుంటున్నారా..? ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ సులువుగా చెల్లించవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ప్రజలు సులువుగా, సులభంగా, వేగంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ మేరకు పేటీఎంతో జీహెచ్‌ఎంసీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పేటీఎం అప్లికేషన్ ద్వారా ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్ ఈజీగా చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

400కిపైగా మెషిన్లు ఏర్పాటు

జీహెచ్‌ఎంసీ భాగస్వామ్యంతో పేటీఎం నగరంలో 400కిపైగా కార్డ్ మెషీన్లను ఏర్పాటు చేసింది. వీటిని ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చు. దీంతో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల్లో వేగం, పారదర్శకత రానుంది. ప్రజా సేవల డిజిటలైజేషన్‌ను సాధ్యం చేయడానికి తాము కట్టుబడి ఉన్నాయని పేటీఎం స్పష్టం తెలిపింది.

మెషిన్లు ఎక్కడెక్కడ ఉంటాయి..?

నగరంలోని ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కేంద్రాలతో పాటు కీలక ప్రదేశాల్లో పేటీఎం ప్రత్యేక కార్డ్ మెషీన్లు అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించి క్యూఆర్ కోడ్‌ల ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. సమీపంలోని కేంద్రాన్ని సందర్శించాక పీటిఐఎన్ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేసి చెల్లింపు విధానాన్ని ఎంచుకోవాలి. ఇక పేటీఎం అప్లికేషన్, ఆన్ లైన్ అప్లికేషన్ ద్వారా కూడా కట్టవచ్చు. ఇక పేటీఎం యాప్ ద్వారా కూడా చేయవచ్చు. పేటీఎం యాప్ ద్వారా చేసేటప్పుడు పీటీఐఎన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

జీహెచ్‌ఎంసీ వెబ్ సైట్ ద్వారా..

-https://www.ghmc.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయండి

-ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు ఎంచుకోండి

-రిజిస్టర్డ్ టెలిఫోన్ నెంబర్, మీ పీటీఐఎన్ నంబర్ ఎంటర్ చేయండి

-తమ వివరాలను ధృవీకరించుకోవాలి

-యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు ఆప్షన్స్ ఎంచుకుని చెల్లింపులు చేయవచ్చు

Follow Us