ట్రేడ్ లైసెన్స్ లేని మల్టిప్లెక్స్‌.. పీవీఆర్ థియేటర్స్‌కు జీహెచ్ఎంసీ నోటీస్..

హైదరాబాద్ పంజాగుట్ట పీవీఆర్ మల్టీప్లెక్స్‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఈ మాల్ రన్ అవుతున్నప్పటికీ ఇప్పటివరకూ ట్రేడ్ లైసెన్స్ లేదని అధికారులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లోగా, అవసరమైన పత్రాలు అందించి, లైసెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో థియేటర్లను వెంటనే మూసివేస్తామని నోటీసులు ఇచ్చారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారుఖీ, ఉప కమిషనర్ గీతారాధిక, టౌన్ ప్లానింగ్ సీపీ భవానితో పాటు పలువురు అధికారులు సోమవారం పీవీఆర్‌లో తనిఖీలు నిర్వహించారు. […]

ట్రేడ్ లైసెన్స్ లేని మల్టిప్లెక్స్‌.. పీవీఆర్ థియేటర్స్‌కు జీహెచ్ఎంసీ నోటీస్..
Follow us

| Edited By:

Updated on: Aug 27, 2019 | 11:39 AM

హైదరాబాద్ పంజాగుట్ట పీవీఆర్ మల్టీప్లెక్స్‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఈ మాల్ రన్ అవుతున్నప్పటికీ ఇప్పటివరకూ ట్రేడ్ లైసెన్స్ లేదని అధికారులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లోగా, అవసరమైన పత్రాలు అందించి, లైసెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో థియేటర్లను వెంటనే మూసివేస్తామని నోటీసులు ఇచ్చారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారుఖీ, ఉప కమిషనర్ గీతారాధిక, టౌన్ ప్లానింగ్ సీపీ భవానితో పాటు పలువురు అధికారులు సోమవారం పీవీఆర్‌లో తనిఖీలు నిర్వహించారు. పీవీఆర్ థియేటర్‌కు అసలు వాణిజ్య అనుమతులు లేవని తనిఖీల్లో తేల్చారు. థియేటర్ నిర్మాణం బాగానే ఉన్నప్పటికి.. అందుకు లైసెన్స్ లేదని అధికారులు గుర్తించారు. రెండు రోజుల్లోగా సంబంధిత పత్రాలు సమర్పించాలని లేనిచో చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Latest Articles