GHMC: మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు.. పాపులేషన్‌లోనూ బిగ్గెస్ట్!

రెసోనెన్స్ కన్సల్టెన్సీ అనే కంపెనీ వరల్డ్స్ బెస్ట్ సిటీస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో నాలుగు ఇండియన్ సిటీలకు ప్లేస్ దక్కింది. బెంగుళూరుకు 29వ ర్యాంక్, ముంబైకి 40వ ర్యాంక్, ఢిల్లీకి 54వ ర్యాంక్, హైదరాబాద్‌కి 82వ ర్యాంక్. బట్.. ఏ మూడేళ్ల తరువాతో మళ్లీ అదే కన్సల్టెన్సీ రిపోర్ట్ తయారుచేసిందనుకోండి. ష్యూర్.. హైదరాబాద్ వరల్డ్‌లోనే టాప్-20లో ఉంటుంది. ఎలా చెప్పగలరనా. హైదరాబాద్‌కున్న అడ్వాంటేజెస్ అలాంటివి.

GHMC: మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు.. పాపులేషన్‌లోనూ బిగ్గెస్ట్!
Ghmc

Updated on: Feb 11, 2026 | 10:00 PM

గ్రేటర్ హైదరాబాద్ కాదిక.. గ్రేటెస్ట్ హైదరాబాద్. ఇదో బృహత్ హైదరాబాద్. దేశంలోనే అతిపెద్ద నగరం.. హైదరాబాద్. ఔటర్ రింగ్ రోడ్ లోపల, దానికి ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ తెలంగాణ క్యాబినెట్ కొన్ని వారాల క్రితం నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ వల్లే.. దేశంలో అతిపెద్ద నగరంగా ఆవిర్భవించింది. జనాభా ఎంతో తెలుసా. కోటి 45 లక్షలు ఉండొచ్చని రఫ్ ఎస్టిమేషన్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా గ్రేటర్ హైదరాబాదే కదా. ఆ లెక్కన జనాభా ఒక కోటి 70 లక్షలు. బట్.. అధికారికంగా జనాభా లెక్కలు తీస్తే.. ఆల్‌మోస్ట్ 2 కోట్లు దాటుతుంది. 2 కోట్ల మంది జనాభా ఉంటే సిటీ అనరు. ‘దేశం’ కింద లెక్కిస్తారు. బెల్జియం, చిలీ, కజకిస్తాన్, జాంబియా, బొలీవియా, రొమేనియా.. ఈ దేశాల జనాభా కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది ఉంటారు జనగణన చేశాక. హర్యానా జనాభా 2 కోట్ల 90 లక్షలు. పంజాబ్‌లో ఉండేది 3 కోట్లు. కేరళ రాష్ట్రం మొత్తం కలిపితే మూడున్నర కోట్లు. అంత పెద్ద ఢిల్లీలో ఉన్నది 2 కోట్ల 10 లక్షల మంది. హైదరాబాద్‌లో 2 కోట్ల జనాభా. సో, మన హైదరాబాద్ ఎంత పెద్దదో చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు. ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి