ఫామ్‌హౌజ్ వీకెండ్ మస్తీలో కొత్త పేర్లు తెరమీదకొస్తున్నాయి. స్పాట్‌లో నక్కి నక్కి తలదాచుకున్న నేతల పేర్లు మెల్లిమెల్లిగా రివీల్ అవుతున్నాయి. నిన్నటి సీన్‌లో లెటెస్ట్‌గా ఓరుగల్లు లీడర్ ఉన్నట్టు క్లియర్ కట్‌గా తెలుస్తోంది. పేకాట పాపారాయుళ్లలో మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు కన్‌ఫామ్ అవుతోంది. ఆ ఒక్క లీడరే కాదు బడా బడా రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు అంతకుమించిన ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ శివారులో SOT పోలీసులతో కలిసి టీవీ9 చేసిన జాయింట్ ఆపరేషన్‌లో ఔరా అనిపించే రేంజ్‌లో జరిగిన మూడు ముక్కలాట వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తోంది. లక్షలు కుమ్మరించి ఆడుతున్న పేకాటలో పొలిటికల్ లీడర్లు కూడా పార్టిసిపేట్ చేసినట్టు స్పష్టమవుతోంది. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య కూడా వీకెండ్ మస్తీలో పాల్గొన్నట్టు కనిపిస్తోంది. టీవీ9 కెమెరాకు చిక్కిన విజువల్స్‌లో ఆయన అక్కడే అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు.
శ్రీరాం భద్రయ్య మాత్రమే కాదు ఆయన వెంట ఇంకా చాలామంది పొలిటికల్ లీడర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఖద్దర్ చొక్కాలో దర్జాగా తిరిగిన నేత.. నిన్న మాత్రం మాస్క్ మాటున తచ్చాడుతూ కనిపించాడు. ఏమీ పాలుపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఆందోళనలో కనిపించాడు. మూడు ముక్కలాటతో నేతల అసలు విశ్వరూపం కళ్లకు కడుతోంది. తీగలాగినా కొద్దీ ఒక్కొ పేరు బయటికొస్తుంది. ఇప్పటికైతే మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య మాత్రమే బయటికొచ్చారు. వాసవి డెవలపర్స్ గ్రూప్‌కు చెందిన రాజారామ్, మద్దుల ప్రకాశ్‌లు కూడా అరెస్టయ్యారు. ఇంకా ఈ మస్తీలో పాల్గొన్న పలువురు నేతలు, రియల్టర్లు ఎవరన్నది తెలియాల్సి ఉంది.
నాగ శౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని సూచించారు. అయితే రవీంద్ర ప్రసాద్.. విల్లాను గుట్ట సుమన్ చౌదరి ఒకరోజుకి అద్దెకు తీసుకున్నట్లు చెబుతున్నారు. రెంటల్ అగ్రిమెంట్‌తో పాటు లీజ్ అగ్రిమెంట్‌తో ఆయన పోలీసుల విచారణకు హాజరుకానున్నారు.
Also Read: Chiranjeevi: దెయ్యం లుక్‌లో మెగాస్టార్.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో
Unstoppable with NBK.. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అతిథుల లిస్ట్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. తారక్ కూడా !